For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: వారి వల్లే సెంచరీ చేశా: ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియా టాప్-3 బ్యాటర్ల కారణంగానే సెంచరీ నమోదు చేశానని ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. టాప్-3 బ్యాటర్లు కొత్త బంతి పాతబడే వరకు ఆడి తన పనిని సులువు చేశారని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.

160 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ సిరీస్‌లో ట్రావిస్ హెడ్‌కు ఇది వరుసగా రెండో శతకం. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లోనూ ట్రావిస్ హెడ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. అతనికి తోడుగా స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101) కూడా శతకంతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు చేసింది.

IND vs AUS Travis Head Credits Top 3 Batters For His Century In Gabba Test

స్మిత్-హెడ్ నాలుగో వికెట్‌కు 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/72) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.

వారి వల్లే ఈజీ అయ్యింది..
రెండో రోజు ఆట అనంతరం ట్రావిస్ హెడ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు. 'అడిలైడ్ శతకం తర్వాత మరో సెంచరీ సాధించడం ప్రత్యేకం. సానుకూల దృక్పథంతో ఆడటం వల్లే ఈ శతకాలు నమోదు చేశాను. మిడిల్ ఓవర్లలో క్రీజులో నిలవాలని అనుకున్నాను. మా టాప్-3 ఆటగాళ్లు కొత్త బంతి పాతబడేవరకు ఆడారు. దాంతో నా షాట్స్ ఆడేందుకు సులువైంది.

కొత్త బంతితో సానుకూలంగా బ్యాటింగ్‌ చేయాలనుకున్నాను. కానీ దూకుడుగా ఆడటం సరదాగా అనిపించింది. సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడటం నాకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్ టేకింగ్ బాల్స్‌ వేసాడు. అతన్ని ఎదుర్కోవడం ఎప్పడూ కష్టమే.

భారత్‌తో ఎలా ఆడాలో తెలుసు...
స్టీవ్ స్మిత్‌తో బ్యాటింగ్ చేయడాన్ని నేనెప్పుడూ ఆస్వాదిస్తాను. అతని ఫుట్‌వర్క్ అద్భుతంగా ఉంటుంది. నా ఆటను నేను ఆస్వాదిస్తున్నాను. జట్టు విజయం కోసం ఆడాలనుకుంటున్నాను. ఇప్పటికే భారత్‌తో నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. ఆ జట్టుతో ఎలా ఆడాలనే విషయంపై నాకు బ్లూ ప్రింట్ ఉంటుంది.

ఆరంభంలో స్పిన్‌‌ను ఎదుర్కోవడంలో కొంత తడబడ్డాను. జడేజాను ఎదుర్కొన్న తీరు పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ మ్యాచ్‌లో కొత్త బంతినే కీలకం కానుంది. వాతావరణం కూడా ఆటకు సహకరిస్తుందని అనుకుంటున్నా. టాప్-6 బ్యాటింగ్ లైనప్ సెట్ అయ్యింది. శ్రీలంకతో సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంటాం. స్మిత్ ఫామ్‌లోకి రావడం మాకు కలిసొచ్చే అంశం.'అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, December 15, 2024, 15:04 [IST]
Other articles published on Dec 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+