Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: అభిమానుల అత్యుత్సాహం.. బీసీసీఐ కీలక నిర్ణయం!

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టీమిండియా ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్ సెషన్‌‌కు అభిమానులను అనుమతించకూడదని నిర్ణయించింది. క్లోజ్‌డ్ డోర్స్‌లో నెట్ ప్రాక్టీస్ చేయాలని ఆదేశించింది.

అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్ కోసం టీమిండియా సమాయాత్తమవుతోంది. ఈ మ్యాచ్ కోసం అడిలైడ్‌లో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. అయితే మంగళవారం నెట్స్‌లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా.. వారిని దగ్గర నుంచి చూసిన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

IND vs AUS Team India bans open net practice after crowd chaos at Adelaide Oval

ఆటగాళ్లపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు తాగిన మైకంలో ఆటగాళ్లపై అనుచిత పదాలు ఉపయోగించినట్లు సమాచారం. దాంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈకపై ఈ పర్యటనలో భారత జట్టు ఓపెన్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనదని తేల్చి చెప్పింది.

'భారత ఆటగాళ్ల ఔట్ డోర్ ప్రాక్టీస్ సెషన్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఆస్ట్రేలియా ఆటగాళ్ల సాధనను చూసేందుకు 70 మంది ప్రేక్షకులు కూడా హాజరు కాలేదు. కానీ టీమిండియా ఆటగాళ్ల సాధనను చూసేందుకు మాత్రం 5వేల మంది వచ్చారు. ఇంత మంది అభిమానులు వస్తారని ఎవరూ ఊహించలేదు.'అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అభిమానుల వల్ల ఇబ్బంది పడినట్లు తెలుపాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Story first published: Wednesday, December 4, 2024, 19:56 [IST]
Other articles published on Dec 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+