Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత జట్టులోకి ముంబై స్పిన్నర్..!

ముంబై ఆల్‌రౌండర్ తనుష్ కోటియన్ టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్‌లు ముగియగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్‌ వర్షం కారణంగా డ్రా అయింది.

మూడో టెస్ట్ అనంతరం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు అశ్విన్ స్వదేశం వచ్చాడు. దాంతో అతని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అయిన తనుష్ కోటియన్‌ను చివరి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

IND vs AUS Tanush Kotian set to join India s squad for the last two Tests of the Border-Gavaskar Trophy

మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌తో పాటు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్‌కు తనుష్ కోటియన్ భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

ఆఫ్ స్పిన్నర్ అయిన 26 ఏళ్ల తనుష్ కోటియన్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున తనుష్ కోటియన్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

అశ్విన్ తరహాలో ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం తనుష్ కోటియన్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన స్పిన్ విభాగంలో తనుష్ కోటియన్ భాగం కానున్నాడు. ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనుష్ కోటియన్ 101 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బ్యాటర్‌గా రెండు శతకాలతో పాటు 13 హాఫ్ సెంచరీలతో 1525 పరుగులు చేశాడు.

గత ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తనుష్ కోటియన్.. ఈ సీజన్‌లో మాత్రం అన్‌సోల్డ్‌గా నిలిచాడు. అయితే తనుష్ కోటియన్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Story first published: Monday, December 23, 2024, 18:21 [IST]
Other articles published on Dec 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+