న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: కోహ్లీ, రోహిత్ క్రేజా మజాకా.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు లక్షల్లో వ్యూస్!

 IND vs AUS T20 World Cup 2022 Practice Match: Virat Kohli And Rohit Sharma Combo Blockbuster Views In Hotstar

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కోసం ఇండియాలో పడి చచ్చే అభిమానులన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇన్‌స్టా, ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తొలి ఆసియా వ్యక్తి.. క్రికెటర్ కింగ్ కోహ్లీనే. అతని ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు కోట్లలో చార్జీలు చేస్తాడంటేనే అతను ఎంతటి ప్రభావంతమైన ఆటగాడో తెలుస్తోంది. విరాట్, రోహిత్ శర్మల కోసమే క్రికెట్ మ్యాచ్‌లు చూసేవారు కోట్లలో ఉన్నారు. ఈ ఇద్దరూ అందుబాటులో లేకుంటే వారు క్రికెట్‌నే పట్టించుకోరు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది.

50 లక్షల వ్యూస్..

50 లక్షల వ్యూస్..

ఈ ఇద్దరి గైర్హాజరీలో ద్వితీయ శ్రేణి టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగానే వచ్చింది. తాజాగా కూడా ఈ విషయం స్పష్టమైంది. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌‌కు రికార్డు వ్యూస్ లభించాయి. ఈ సన్నాహక మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం అందించగా.. అభిమానులు ఎగబడి చూశారు. వామప్ మ్యాచ్ అని తెలిసి కూడా.. అంతర్జాతీయ మ్యాచ్‌లా ఆసక్తిగా తిలకించారు. దాంతో ఈ మ్యాచ్‌కు హాట్‌స్టార్‌లో గరిష్టంగా 50 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. కనిష్టంగా 30 లక్షలకు పైనే వచ్చాయి.

టీమ్ బలబలాల కోసం..

టీమ్ బలబలాల కోసం..

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటంతోనే అభిమానులు ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. దీనికి తోడు టీ20 ప్రపంచకప్ ముందు కావడంతో టీమ్ బలబలాలను తెలుసుకునేందుకు ఆసక్తికనబరిచారు. ప్రాక్టీస్ మ్యాచ్‌‌కు 50 లక్షల వ్యూస్ వస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు ఆడిన మ్యాచ్‌లకు 20 లక్షల వ్యూస్ కూడా రాకపోవడం గమనార్హం.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు..

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు..

ఈ సిరీస్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి వన్డేను కూడా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే హాట్ స్టార్‌లో కోటికిపైనే వ్యూస్ వస్తాయి. కానీ ఈ సిరీస్‌లో 50 లక్షల వ్యూస్ కూడా రాలేదు. ఈ సిరీస్‌కు ప్రేక్షక ఆదరణ లభించకపోవడానికి సీనియర్ ప్లేయర్లు లేకపోవడమే ప్రధాన కారణం. ఆదివారం జరిగిన భారత్Xసౌతాఫ్రికా రెండో వన్డేను కూడా జనాలు ఎంతగా లైట్ తీసుకున్నారంటే.. సాధారణ మ్యాచ్‌ల్లో వచ్చే 10 శాతం వ్యూస్ కూడా రావడం లేదు.

థ్రిల్లింగ్ విక్టరీ..

థ్రిల్లింగ్ విక్టరీ..

ఈ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలు బాదారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, అష్టన్ అగర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. ఒకే ఒక ఓవర్ వేసిన మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, October 18, 2022, 15:22 [IST]
Other articles published on Oct 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X