Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS T20 Series స్వదేశం బయల్దేరిన ఆసీస్ స్టార్స్..!

IND vs AUS T20 Series: భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మూడు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన జట్టులో మార్పులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా భారీ విజయాలు సాధించడంతో ఈ సిరీస్‌ను పూర్తిగా లైట్ తీసుకున్న ఆసీస్.. జట్టులోని ఆరుగురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.

వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇప్పటికే స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు, స్టీవ్ స్మిత్ ఇప్పటికే స్వదేశం వెళ్లిపోయారు. గువాహతి వేదికగా నేడు జరిగే మూడో టీ20 పూర్తయిన తర్వాత స్టార్ ఆటగాళ్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టయినిస్, జోస్ ఇంగ్లిస్, సీన్ అబాట్‌లు కూడా స్వదేశానికి పయనం కానున్నారు.

IND vs AUS T20 Series: Australia Announce Changes in Squad Midway Through India Series

ప్రపంచకప్ ఆడిన జట్టులో ఉన్న ట్రావిస్ హెడ్ మాత్రమే భారత్‌తో టీ20 సిరీస్‌లో కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ట్రావిస్ హెడ్.. ఆసీస్‌‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇక స్వదేశం వెళ్లనున్న స్టీవ్ స్మిత్,గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, జోస్ ఇంగ్లిస్, సీన్ అబాట్, మార్కస్ స్టోయినీస్ స్థానాల్లో బెన్ మెక్‌డెర్మోట్, జోస్ ఫిలిప్, బెన్ డ్వార్‌షుయిస్, క్రిస్ గ్రీన్ ఆసీస్ జట్టులోకి వచ్చారు.

ప్రపంచకప్ ముగిసిన నాలుగు రోజులకే ఈ సిరీస్ ప్రారంభం కాగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చింది. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా సైతం ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్ వంటి ప్లేయర్లకు విశ్రాంతి మిగతా ఆటగాళ్లను కొనసాగించింది. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవటంతో ఈ సిరీస్‌ను ఆసీస్ లైట్ తీస్కోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

చివరి మూడు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు:

మ్యాథ్యూ వేడ్ (కెప్టెన్), జోస్ బెహ్రాడార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్‌షుయిస్, నాథన్ ఇల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డొర్మేట్, జోస్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మ్యాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్

Story first published: Tuesday, November 28, 2023, 14:40 [IST]
Other articles published on Nov 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+