IND vs AUS: సూర్య కళ్లు చెదిరే ఫీల్డింగ్.. బిత్తరపోయిన కామెరూన్ గ్రీన్!
మొహాలీ: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో సూర్య సూపర్ ఫీల్డింగ్‌తో ఆసీస్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్(31)ను రనౌట్ చేశాడు. సూర్య సెన్సేషనల్ ఫీల్డింగ్‌కు కామెరూన్ గ్రీన్ నోరెళ్ల బెట్టాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని గ్రీన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ స్లోయర్ బంతి కావడంతో అతని బ్యాట్‌ను మిస్సై కీపర్ చేతిలోకి వెళ్లింది. మరీ స్లో బాల్ కావడంతో రాహుల్‌కు రీచ్ కాలేకపోయింది. దాంతో అతను ఆ బంతిని అందుకోలేకపోయాడు. గ్లోవ్స్ తాకిన బంతి వెనక్కువెళ్లింది. దాంతో బ్యాటర్లు రన్‌కు పరుగెత్తారు.

బ్యాకప్ ఫీల్డర్ స్లోగా వస్తుండటంతో కామెరూన్ గ్రీన్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ నాన్‌స్ట్రైకర్ అలర్ట్‌గా లేకపోవడం.. ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసి.. యూటర్న్ తీసుకున్నాడు. ఇది గమనించిన రుతురాజ్ గైక్వాడ్ నాన్ స్ట్రైకర్ వైపు బంతిని వేయగా.. సూర్యకుమార్ అందుకొని చాకచక్యంగా రనౌట్ చేశాడు.
సమయస్పూర్తిగా వ్యవహరించిన సూరీడు సూపర్ డైవ్‌తో వికెట్ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో లేని పరుగు కోసం వెళ్లి కామెరూన్ గ్రీన్ వికెట్ ఇచ్చుకున్నాడు.
బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్ల తోడుగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications