Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఇషాన్, సూర్య మళ్లీ విఫలం.. వన్డేలకు పనికిరారంటున్న ఫ్యాన్స్!

IND vs AUS: Suryakumar Yadav brutally trolled after golden duck in 1st ODI against Australia

ముంబై: వన్డే ఫార్మాట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తడబాటు కొనసాగుతోంది. టీ20 నెంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్య.. వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలోనూ సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరమైన నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న సూర్య.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ప్లేయర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) సైతం బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

బామ్మర్థి పెళ్లి కోసం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా..అతని స్థానంలో అవకాశాన్ని అందుకున్న ఇషాన్ దారుణంగా విఫలమయ్యాడు. మార్కస్ స్టోయినీస్ వేసిన రెండో ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(4) కూడా నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli)ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్ కూడా ఔటవ్వడంతో 16 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు.

దారుణంగా విఫలమైన సూర్య, ఇషాన్ కిషన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ ఇక బెంచ్‌పైనే కూర్చోవాలని, సూర్యకుమార్ యాదవ్ సైతం వన్డేలకు పనికిరాడని ఘాటుగా విమర్శిస్తున్నారు. 100 పరుగుల దూరంలో సూర్య సెంచరీ చేజార్చుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. జట్టుకు అవసరమైనప్పుడుల్లా విఫలమవడం సూర్యకు అలవాటేనని విమర్శిస్తున్నారు. సూర్య తన కెరీర్‌లో ఒక్క న్యూజిలాండ్ తప్పా.. చిన్న దేశాలపైనే సెంచరీలు చేశాడని విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా వంటి క్వాలిటీ టీమ్స్‌పై ఆడటం సూర్యకు చేతకాదని మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇషాన్ కిషన్‌ను కూడా జట్టులో నుంచి తప్పించాలని సూచిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, March 17, 2023, 18:20 [IST]
Other articles published on Mar 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+