IND vs AUS: 8 రోజుల బ్రేక్ లభించినా.. షమీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ తప్పు చేశాడు!

అహ్మదాబాద్: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి అనవసరంగా విశ్రాంతి ఇచ్చారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ముగిసిన తర్వాత.. మూడో టెస్ట్‌కు 8 రోజు విరామం దొరికిందని గుర్తు చేశాడు. అయినా వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట షమీని మూడో టెస్ట్ నుంచి తప్పించి రోహిత్ శర్మ పెద్ద తప్పిదం చేశాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ తప్పిదం ఫలితాన్ని అహ్మదాబాద్ టెస్ట్‌లో అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. రిథమ్ అందుకోవడానికి టైమ్ తీసుకున్నాడు. తొలి స్పెల్‌లో చాలా అసౌకర్యంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతినే వైడ్‌గా వేసిన అతను ఫస్ట్ ఓవర్‌లోనే 10 పరుగులిచ్చుకున్నాడు.

అనవసరంగా రెస్ట్..
కామెంట్రీ చెబుతూ.. షమీ వైఫల్యంపై స్పందించిన సునీల్ గవాస్కర్.. విశ్రాంతి ఇవ్వాల్సింది కాదన్నాడు. 'మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం తెలివైన నిర్ణయం కాదు. రెండో టెస్ట్.. మూడో టెస్ట్‌కు మధ్య 8 రోజుల బ్రేక్ లభించింది. ఈ మ్యాచ్‌లో షమీ తొలి రెండు బంతులను మిలటరీ మీడియంతో బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు నర్వస్‌గా కనిపించినా.. షమీ రిథమ్‌లో బౌలింగ్ చేయలేదు. బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్తుంది. పిచ్ స్పందించిన తీరును చూసి షమీ రిలాక్స్ అయినట్లు కనిపించింది.

రెగ్యూలర్‌గా ఆడించాలి..
మహమ్మద్ షమీ వంటి స్టార్ పేసర్లను విశ్రాంతి ఇవ్వకుండా ఆడించాలి. రిథమ్ కోల్పోకుండా జాగ్రత్తపడాలి. బౌలింగ్ కండరాలను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జిమ్‌లో ఎంత కష్టపడినా అవి బలంగా మారవు. మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తే కండరాలు బలంగా ఉండి రిథమ్ కోల్పోకుండా ఉంటుంది. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌తో ఆటగాళ్లను పక్కనపెట్టడం ఏ మాత్రం సరైంది కాదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ స్పెల్‌లో దారుణంగా విఫలమైన షమీ.. సెకండ్ స్పెల్‌లో స్టన్నింగ్ డెలివరీతో వికెట్ తీసాడు. కీలక లబుషేన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. కాస్త అలసిపోయినట్లు కూడా కనిపించింది.

ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(32), ఉస్మాన్ ఖవాజా శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం ట్రావిస్ హెడ్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. లబుషేన్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి స్మిత్ రాగా.. ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. 146 బంతుల్లో ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మిత్(38 బ్యాటింగ్) అతనికి అండగా నిలిచాడు. దాంతో ఆసీస్.. 149/2 స్కోర్‌తో సెకండ్ సెషన్‌ను ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications