Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్.. నోరెళ్ల‌బెట్టిన హార్దిక్ పాండ్యా! (వీడియో)

Steve Smith takes a stunning catch to dismiss Hardik Pandya in 2nd ODI
Photo Credit: Twitter

విశాఖపట్నం: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. భారత్‌తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్‌కు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నోరెళ్లబెట్టాడు. నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఏడాది అత్యుత్తమ క్యాచ్‌ల్లో స్మిత్ అందుకున్న ఈ క్యాచ్ టాప్‌లో నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. అచ్చం చేప పిల్లలానే అతను డైవ్ చేసిన విధానం.. సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్న తీరు మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు, టీవీల ముందున్న అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది.

సీన్ అబాట్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని అబాట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్‌గా వేయగా.. హార్దిక్ పాండ్యా పుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ ఫీల్డర్‌కు దూరంగా దూసుకెళ్లింది. కానీ బంతి రావడం గమనించి అప్రమత్తమైన స్మిత్ సెన్సేషనల్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న విధానం చూసి హార్దిక్ పాండ్యా కాసేపు నమ్మలేకపోయాడు. ఈ వికెట్‌తో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్ మూడో బంతికి గిల్ క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ‌తో రోహిత్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ మిచెల్ స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్(13), సూర్య(0)ను ఔట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీసాడు.

సూర్య వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్(9)ను కూడా స్టార్క్ ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో టీమిండియా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలుస్తాడనుకున్న హార్దిక్.. స్మిత్ సెన్సేషనల్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి విరాట్ కోహ్లీ పోరాడుతున్నాడు.

Story first published: Sunday, March 19, 2023, 14:51 [IST]
Other articles published on Mar 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+