Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: స్మిత్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. బిత్తరపోయిన కేఎల్ రాహుల్!(వీడియో)

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను స్టీవ్ స్మిత్ స్లిప్‌లో సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు.

రెప్పపాటు సమయంలో రియాక్ట్ అయ్యి స్మిత్ ఈ క్యాచ్ అందుకోవడం గమనార్హం. స్మిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు కేఎల్ రాహుల్ బిత్తరపోయాడు. భారత టాపార్డర్ విఫలమైన వేళ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ స్మిత్ సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో అతని పోరాటం ముగిసింది. 139 బంతుల్లో 8 ఫోర్లతో 84 పరుగులు చేసిన రాహుల్ 16 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. రాహుల్ వికెట్‌తో ఆరో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs AUS Steve Smith Takes A Diving Single Hand Catch At Slips To Dismiss KL Rahul At Gabba video

నాథన్ లయన్ వేసిన 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని నాథన్ లయన్ డ్రైవ్ లెంగ్త్‌లో వేయగా.. కేఎల్ రాహుల్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న స్మిత్ కుడివైపు దూసుకెళ్లగా.. అతను సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. నాలుగో రోజు ఆటలో తొలి బంతికే కేఎల్ రాహుల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలేసిన స్మిత్.. స్టన్నింగ్ క్యాచ్‌తో అతన్ని ఔట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. స్మిత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే రాహుల్ 33 పరుగులకే వెనుదిరిగేవాడు. ప్రస్తుతం స్మిత్‌కు సంబంధించిన సింగిల్ హ్యాండ్ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కేఎల్ రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో జడేజా ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి సెషన్‌ను 165/6తో ముగించారు. లంచ్ బ్రేక్ అనంతరం వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101), ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152) శతకాలతో రాణించిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(6/78) ఒక్కడే రాణించగా.. సిరాజ్(2/97) రెండు వికెట్లు తీసాడు. ఆకాశ్ దీప్, నితీష్ కుమార్‌రెడ్డిలకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను వర్షమే గట్టెక్కించాలి.

Story first published: Tuesday, December 17, 2024, 10:01 [IST]
Other articles published on Dec 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+