Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS:స్టీవ్ స్మిత్ కొంపముంచిన అత్యుత్సాహం.. జడేజా బంతికి నోరెళ్లబెట్టిన ఆసీస్ బ్యాటర్! (వీడియో)

 IND vs AUS: Steve Smith reaction after Ravindra Jadeja cleaned up him goes viral

నాగ్‌పూర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఆసీస్ బ్యాటర్లను వణికిస్తున్నారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. తన బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. డేంజరస్ బ్యాటర్లు అయిన మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), మ్యాట్ రేన్ షా(0)లను జడేజా పెవిలియన్ చేర్చాడు.

నోరెళ్ల బెట్టిన స్మిత్..

ఇందులో లబుషేన్, మ్యాట్ రేన్‌షాను వరుస బంతుల్లో ఔట్ చేసిన జడేజా.. స్టీవ్ స్మిత్‌ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. అతను వేసిన బంతి స్మిత్ బ్యాట్, ప్యాడ్‌కు మధ్యలో సందులో నుంచి దూసుకెళ్లి మిడిల్ వికెట్‌ను ఎగరగొట్టేసింది. ఈ ఊహించని స్టన్నింగ్ డెలివరీకి స్మిత్ బిత్తరపోయాడు. ఇదేం బంతంటూ నోరెళ్లబెట్టాడు. జడేజా బౌలింగ్‌కు ఫిదా అయిన స్మిత్.. అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోగా.. స్మిత్ రియాక్షన్ వైరల్ అయ్యింది.

స్మిత్ కొంపముంచిన నోబాల్......

జడేజా వేసిన 42వ ఓవర్ చివరి బంతికి స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వాస్తవానికి ఇది ఎక్స్‌ట్రా డెలివరీ. మూడో బంతిని జడేజా నోబాల్‌గా వేయడంతో అదనపు బంతి వేయాల్సి వచ్చింది. ఈ ఎక్స్‌ట్రా బాల్‌కే స్మిత్‌ వెనుదిరిగాల్సి వచ్చింది. నోబాల్ తర్వాత సింగిల్ తీసే ఆస్కారం ఉన్నా స్మిత్ నిరాకరించడం అతని కొంపముంచింది.

తానే స్ట్రైక్ తీసుకోవాలనే అత్యుత్సాంతో స్మిత్ మూల్యం చెల్లించుకున్నాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌పై వేసిన బంతిని స్మిత్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి టర్న్ తీసుకొని స్మిత్ బ్యాట్, ప్యాడ్ మధ్యలో ఉన్న గ్యాప్‌లో నుంచి దూసుకెళ్లి వికెట్లను తాకింది. హ్యాండ్‌స్కోంబ్ సింగిల్‌ కోసం కాల్ ఇచ్చినప్పుడు పరుగు తీసినా స్మిత్ బచాయించేవాడు. దాంతోనే అతను విచిత్రమైన రియాక్షన్‌తో పెవిలియన్ చేరినట్లు తెలుస్తోంది.

ఓపెనర్లు విఫలం..

ఓపెనర్లు విఫలం..

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1) ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సిరాజ్ ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఖవాజా ఔటవ్వగా... ఆ మరుసటి ఓవర్లోనే అద్భుతమైన డెలివరీతో డేవిడ్ వార్నర్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 2 పరుగలకే ఓపెనర్ల వికెట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. అయితే లబుషేన్, స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండానే ఆడటంతో ఆసీస్ 76/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

మలుపు తిప్పిన జడేజా..

మలుపు తిప్పిన జడేజా..

లంచ్ బ్రేక్ అనంతరం క్రీజులో పాతుకు పోయిన స్మిత్, లబుషేన్ జోడీని జడేజా విడదీసాడు. భారీ షాట్ కోసం క్రీజును ధాటిన లబుషేన్‌ను తెలుగు తేజం కేఎస్ భరత్ సూపర్ స్టంప్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే మ్యాట్ రేన్‌షా(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ పరిస్థితుల్లో పీటర్ హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్ క్యారీ(36) భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 53 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని అశ్విన్ విడదీసాడు. క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(6) కోహ్లీ సాయంతో అశ్విన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. అరంగేట్ర ప్లేయర్ టాడ్ ముర్ఫీ(0)ని ఎల్బీగా ఔట్ చేయడంతో ఆసీస్ 173 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.

Story first published: Thursday, February 9, 2023, 14:33 [IST]
Other articles published on Feb 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+