India vs Australia: స్టీవ్ స్మిత్ ఆస్కార్ లెవెల్ ఛీటింగ్.. ఇజ్జత్ తీసిన రోహిత్ శర్మ( వీడియో)

మొహాలీ: టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. మంగళవారం జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇమిటేట్ చేయడం చర్చనీయాంశమైంది.
తన ఔట్ విషయంలో స్మిత్ చేసిన ఆస్కార్ లెవల్ చీటింగ్‌ను రోహిత్ వెక్కిరించాడు. ఇక వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను అయితే బండ బూతులు తిట్టాడు. గొంతు పట్టి నోట్లో ఏం పెట్టుకున్నావ్ అంటూ చివాట్లు పెట్టాడు. సరదాగానే చేసినా.. కార్తీక్ కీపింగ్ పట్ల రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్థమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది..?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఉమేశ్ యాదవ్ వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి రెండు బంతులను 6, 4 బాదిన స్మిత్.. మూడో బంతిని ఇన్నోవేటివ్‌గా ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. ఉమేశ్ వేసిన ఈ వైడ్ యార్కర్‌ను స్కూప్ షాట్ ఆడబోయిన స్మిత్.. చివరి నిమిషంలో మనసు మార్చుకొని థర్డ్ మ్యాన్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడగా.. భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు.
ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌటిచ్చాడు. దాంతో అవాక్కైన రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. స్మిత్ దగ్గరకు వచ్చి బ్యాట్ తాకలేదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దానికి స్మిత్ తాకలేదంటూ ఆస్కార్ లెవల్ నటనను ప్రదర్శించాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు.
దినేశ్ కార్తీక్‌ను తిడుతూ..
అదే ఓవర్ చివరి బంతికి గ్లేన్ మ్యాక్స్‌వెల్ సైతం ఔటయ్యాడు. ఉమేశ్ వేసిన షాట్ బాల్‌ను మ్యాక్సీ ఓవర్ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. మరోసారి అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో షాక్ అయిన రోహిత్ మళ్లీ రివ్యూ కోరాడు. దినేశ్ కార్తీక్ క్లారిటీ లేదని చెప్పినా.. వినలేదు. అయితే రిప్లేలో బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. రోహిత్ మాత్రం కార్తీక్‌ను బండ బూతులు తిట్టాడు. చెవులు వినపడటం లేదా? అని తల పట్టుకొని అడిగాడు. ఆ తర్వాత స్మిత్ ఫేస్ రియాక్షన్‌ను ఇమిటేట్ చేశాడు.

హార్దిక్ విధ్వసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) చెలరేగగా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

గ్రీన్, మాథ్యూ వేడ్ సూపర్ ఇన్నింగ్స్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడగా.. మాథ్యూవేడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక విజయంపై పట్టు బిగించిన సమయంలో హర్షల్ పటేల్ క్యాచ్ నేలపాలు చేయడంతో పాటు ధారళంగా పరుగులివ్వడం టీమిండియా కొంపముంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications