Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: స్వాగత బోర్డుపై కనిపించని గంగూలీ ఫొటో.. జై షాపై దాదా ఫ్యాన్స్ ఫైర్!

IND vs AUS: Sourav Ganguly fans slams BCCI over Ahmedabad test Welcome Board

న్యూఢిల్లీ: గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ), బీసీసీఐ సెక్రటరీ జై షాలపై సౌరవ్ గంగూలీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనదైన సారథ్యంలో భారత క్రికెట్‌లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చిన దాదాను విస్మరించడం దారుణమని, కుళ్లు రాజకీయాలతో ఓ గొప్ప ఆటగాడిని అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీని ఉన్నట్టుండి ఆ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. జై షానే దాదాను బీసీసీఐ నుంచి తప్పించాడనే వార్తలు వచ్చాయి. సెక్రటరీ అయిన జై షానే బీసీసీఐ ఏలుతున్నాడని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

జై షా‌దే రాజ్యం..

జై షా‌దే రాజ్యం..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. జై షా తండ్రి కావడంతో అతనికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారని ఓ వర్గం ఎప్పటి నుంచో వాదిస్తుంది. అసలు ఏ అర్హతతో జై షా బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నాడని ప్రతిపక్షాలు కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఆఖరి టెస్ట్ నేపథ్యంలో జై షా అభిమానులు ఆగ్రహానికి గురయ్యాడు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

స్వాగత బోర్డులో లేని దాదా ఫొటో..

స్వాగత బోర్డులో లేని దాదా ఫొటో..

దాంతో ఇరు దేశాల ప్రధానుల రాకను ఉద్దేశించి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్.. స్టేడియం ఎంట్రీలో ఓ స్వాగత బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుపై ఇరు వైపుల రెండు దేశాల ప్రధానుల ఫొటోలు ఉండగా.. మధ్యలో ఆసీస్, భారత స్టార్ ఆటగాళ్ల ఫొటోలు ఉన్నాయి. సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్ దగ్గర నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోనీ, అశ్విన్, లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌ల ఫొటోలను ఉంచింది. దీనికి క్రికెట్‌తో ఇరు దేశాల మధ్య స్నేహమంటూ క్యాప్షన్‌గా పేర్కొంది.

జై షా పనే అంటూ..

అయితే ఈ బోర్డులో గంగూలీ ఫొటో లేకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. భారత క్రికెట్‌‌కు దూకుడు నేర్పిన సారథి దాదాను మర్చిపోతారా? అని మండిపడుతున్నారు. జై షా కన్నుసన్నల్లో నడిచే గుజరాత్ క్రికెట్ అసొసియేషన్ ఉద్దేశపూర్వకంగానే దాదా ఫొటోను విస్మరించిందని ఆరోపిస్తున్నారు. గంగూలీ, సచిన్ ఫొటోలు వేసినప్పుడు గంగూలీది ఎందుకు వేయరని ప్రశ్నిస్తున్నారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించిన ఆటగాళ్లనే ఆ బోర్డుపై వేసారని కొందరు వాదించగా.. దాదా కంటే రోహిత్ శర్మ ఎక్కువ రాణించాడా? అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.

Story first published: Tuesday, March 7, 2023, 21:24 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+