పేలవ ఫామ్‌తో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దిగ్గజ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. తనకు అచ్చొచ్చిన ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీ చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమవ్వడంపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన పనిలేదన్నాడు. బ్యాటింగ్‌కు పిచ్‌లు అనుకూలంగా లేకపోవడంతోనే కోహ్లీ రాణించలేకపోయాడని చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీకి చివరి సిరీస్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది కోహ్లీ 12 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. అతని పేలవ ఫామ్ టీమిండియా పరాజయాలకు కారణమవుతోంది. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉండటం కలిసొచ్చే అంశం.
ఆసీస్ గడ్డపై 13 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గంగూలీ.. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్‌పై ధీమా వ్యక్తం చేశాడు.
'విరాట్ కోహ్లీ ఓ ఛాంపియన్ బ్యాటర్. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. గతంలో ఆసీస్ గడ్డపై కోహ్లీ దుమ్మురేపాడు. 2014 పర్యటనలో నాలుగు శతకాలు.. 2018లో ఒక శతకం బాదాడు. తాజా సిరీస్‌లోనూ సత్తా చాటుతాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకి ఇదే చివరి టెస్ట్ సిరీస్ కానుంది. కాబట్టి అతనికి ఈ సిరీస్ చాలా కీలకమైనది.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కోహ్లీ వైఫల్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్‌కు ఆ పిచ్‌లు ప్రతికూలంగా ఉన్నాయి. బ్యాటింగ్‌కు సహకరించలేదు. కానీ ఆస్ట్రేలియాలో పిచ్‌లు అలా ఉండవు.
అక్కడి పరిస్థితులను కోహ్లీ బాగా ఆస్వాదిస్తాడు. అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడనుకుంటున్నా.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా తుది జట్టులో చోటివ్వాలని సూచించాడు.