ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో స్మృతి మంధాన(106 బంతుల్లో 12 ఫోర్లతో 74) తృటిలో శతకాన్ని చేజార్చుకుంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నఈ బ్యూటీ బ్యాటర్.. అలసత్వంతో రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో 26 పరుగుల దూరంలో టెస్ట్‌ల్లో రెండో శతకం నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది.
సరైన సమయానికే క్రీజులోకి చేరుకున్నా.. బ్యాట్ పెట్టడంలో స్మృతి మంధాన అలసత్వం ప్రదర్శించింది. ఇంగ్లండ్‌తో ముంబై వేదికగా జరిగిన గత టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఔటైనట్లే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన రనౌట్‌గా వెనుదిరిగింది. అష్లే గార్డ్‌నర్ వేసిన 39వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ నాలుగో బంతిని స్మృతి మంధాన బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా ఆడగా.. నాన్‌స్ట్రైకర్ రిచా ఘోష్ క్విక్ సింగిల్‌కు పిలుపునిచ్చింది. కానీ మెక్‌గ్రాత్ బంతిని అందుకోవడం బ్యాటర్ల మధ్య కనఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. మధ్యలో ఆగుతూ ముందుకు వెళ్లడంతో రనౌట్‌కు దారి తీసింది. మెక్‌గ్రాత్ బంతి చాకచక్యంగా బౌలర్ గార్డనర్‌కు అందజేయగా ఆమె వికెట్లను కొట్టేసింది.
అప్పటికే స్మృతి మంధాన క్రీజు సమీపానికి వచ్చినా.. అలసత్వంతో బ్యాట్‌ను పెట్టలేకపోయింది. ఇంచు తేడాలో లైన్‌కు ముందు బ్యాట్ స్ట్రక్ అయిపోయింది. కొంచెం స్ట్రెచ్ చేసినా స్మృతి మంధాన నాటౌట్‌గా నిలిచేది. ఈ రనౌట్‌తో స్మృతి మంధాన నిరాశగా పెవిలియన్‌కు చేరింది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట సెకండ్ సెషన్ ముగిసేసరికి 108 ఓవర్లలో 7 వికెట్లకు 348 రన్స్ చేసింది. క్రీజులో దీప్తి శర్మ(48 బ్యాటింగ్)తో పాటు పూజావస్త్రాకర్(27 బ్యాటింగ్) ఉన్నారు.
స్మృతి మంధానకు తోడుగా రిచా ఘోష్(104 బంతుల్లో 7 ఫోర్లతో 52), జెమీమా రోడ్రిగ్స్(121 బంతుల్లో 9 ఫోర్లతో 73) హాఫ్ సెంచరీలతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్(4/97) నాలుగు వికెట్లు తీయగా.. లారేన్ చీట్లే, జెస్స్ జొనస్సెన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు కుప్పకూలింది. పూజా వస్త్రాకర్(4/53), స్నేహ్ రాణా(3/56), దీప్తి శర్మ(2/45) సత్తా చాటారు. తహిలా మెక్‌గ్రాత్(56 బంతుల్లో 8 ఫోర్లతో 50) ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించగా.. బెత్ మూనీ(94 బంతుల్లో 2 ఫోర్లతో 40), అలీసా హీలీ(75 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38) పర్వాలేదనిపించారు.