For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: శతక్కొట్టిన గిల్, అయ్యర్.. సూర్య సునామీతో ఆసీస్ టార్గెట్ 400

ఇండోర్: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.

IND vs AUS: Shubman Gill and Shreyas Iyer tons, Surykumar Yadav’s masterclass power India to 399

ఇషాన్ కిషాన్(31) సైతం పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు.

భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.

శుభారంభం లేకున్నా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోష్ హజెల్ వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.

చెలరేగిన అయ్యర్, గిల్..
ఏ బౌలర్ అనే తేడా లేకుండా బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ముందుగా శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

హాఫ్ సెంచరీ అనంతరం అయ్యర్ ధాటిగా ఆడాడు. 86 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో లైఫ్ లభించినా.. తగ్గేదేలే అన్నట్లు ఆడి సీన్ అబాట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 200 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కేఎల్ రాహుల్ రాగా.. శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. అతను కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు.

సూర్య విధ్వంసం..
ఈ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌తో కలిసి స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్.. సూర్యతో కలిసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ ఔటైనా.. సూర్య తనదైన శైలిలో చెలరగాడు. వరుస సిక్స్‌లతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య జట్టుకు 399 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Story first published: Sunday, September 24, 2023, 18:25 [IST]
Other articles published on Sep 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+