
గాయం నుంచి కోలుకున్నా..
అయితే అతను గాయం నుంచి కోలుకున్నా నేరుగా మ్యాచ్ ఆడించలేని పరిస్థితి నెలకొందని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌నెస్ విషయంలో కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. ఏ ఆటగాడైనా గాయం నుంచి కోలుకున్నాక తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే ఏదో ఒక దేశవాళీ మ్యాచ్ ఆడాలి. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం రంజీ మ్యాచ్‌లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక నెల రోజుల నుంచి శ్రేయస్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కాబట్టి అతణ్ని నేరుగా టెస్టు మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు లేవని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

ఇరానీ కప్ ఆడితే..
ఈ క్రమంలోనే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. మార్చి 1 నుంచి 5 వరకు జరిగే ఇరానీ కప్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడే రెస్టాఫ్ ఇండియా జట్టుకు అతణ్ని ఎంపిక చేస్తుందా? లేదా అన్నది ఆసక్తికరం. ఎంపికైతే ఆ మ్యాచ్‌లో ఆడడం ద్వారా శ్రేయస్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.

బుమ్రా విషయంలో తొందరలేదు..
ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతణ్ని తిరిగి జట్టుకు ఎంపిక చేసే విషయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ తొందరపడాలనుకోవట్లేదు. దీంతో ఆస్ట్రేలియాతో వన్డేలకు అతణ్ని ఎంపిక చేసే అవకాశం లేదు. ఒకవేళ భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరితే.. అక్కడ అతని అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే భారత్‌లో వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌తో బుమ్రా పునరాగమనం చేసే అవకాశముంది.

చెమటోడ్చుతున్న ఆటగాళ్లు..
మరోవైపు రెండో టెస్టు నేపథ్యంలో వీసీఏ స్టేడియంలో పుజారా, జడేజా నెట్స్‌లో చెమటోడ్చారు. సోమవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో వికెట్ కీపర్ కేఎస్ భరత్ తన కీపింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. మరోవైపు తమ సన్నాహకాలకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆస్ట్రేలియా జట్టు ఆరోపణలు గుప్పించింది. వీసీఏ స్టేడియంలో సెంట్రల్ వికెట్‌పై ప్రాక్టీస్ చేయాలని భావించిన తమకు.. గ్రౌండ్ స్టాఫ్ రూపంలో నిరాశే ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పై మైదాన సిబ్బంది నీళ్లు జల్లారని మండిపడింది.


Click it and Unblock the Notifications












