Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: తొలి టెస్ట్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. సూర్యకుమార్ యాదవ్ మార్గం సుగుమం!

IND vs AUS: Shreyas Iyer ruled out of first Test, Suryakumar Yadav likely to make debut

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో వెన్ను గాయానికి గురైన శ్రేయస్ అయ్యర్ ఉన్నపళంగా జట్టును వీడాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులో శ్రేయస్ అయ్యర్ పేరు ఉండగా.. అతను తొలి టెస్ట్‌కు దూరమయ్యాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఇంకా రెండు వారాల సమయం పడుతుందని ఎన్‌సీఏ వర్గాలు తెలిపినట్లు బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపాడు.

సూర్యకు లైన్ క్లియర్..

సూర్యకు లైన్ క్లియర్..

రెండో టెస్ట్‌కు అయినా అతను అందుబాటులో ఉంటాడా? అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని, ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాతనే అతను భారత జట్టుతో కలుస్తాడని సదరు అధికారి స్పష్టం చేశాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీతో యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మార్గం సుగుమమైంది.

నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌తో సూర్య అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదం కారణంగా రిషభ్ పంత్ కూడా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో అటాకింగ్ ఆప్షన్ కోసం సూర్యను ఆడించనున్నారు.

సూర్య కోసం అయ్యర్ దూరం..

సూర్య కోసం అయ్యర్ దూరం..

ఇక సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ.. అయ్యర్ గాయాన్ని వంకగా చూపుతూ పక్కనపెడుతుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్‌కు షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉందని, ఐపీఎల్‌లోనూ, భారత్‌కు ఆడిన సందర్భాల్లోనూ శ్రేయస్ అయ్యర్‌లో ఈ టెక్నిక్ లోపం స్పష్టంగా కనిపించిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

కేకేఆర్‌ మాజీ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌ వీక్‌నెస్‌ను బాగా వాడుకొని బోల్తా కొట్టించాడని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు సైతం బౌన్సర్లతో దాడి చేస్తారని, వారిని అయ్యర్ ఎదుర్కోలేడనే పక్కకు తప్పించారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

జడేజా రీఎంట్రీ..

జడేజా రీఎంట్రీ..

ఆసియాకప్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రంజీ ట్రోఫీలోసౌరాష్ట్ర తరఫున జడేజా బరిలోకి దిగాడు. 41 ఓవర్లపాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు తీసాడు. దాంతో అతను తొలి టెస్ట్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Story first published: Wednesday, February 1, 2023, 16:11 [IST]
Other articles published on Feb 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+