Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: గబ్బాలో మెరిసిన సారా టెండూల్కర్.. అతని కోసమే అంటూ..!

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌కు హాజరైంది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం గబ్బా స్టేడియం వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌కు సచిన్ తనయ హాజరైంది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని టీమిండియాకు మద్దతు తెలిపింది. ప్రస్తుతం సారా టెండూల్కర్‌ మ్యాచ్‌కు హాజరైన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమిండియా కోసం కాదని, శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు హాజరైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ శతకం బాదడం ఖాయమంటున్నారు.

IND vs AUS Sara Tendulkar Spotted Cheering For India During 3rd Test At Gabba

సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ పలు కార్యాక్రమాలకు హాజరైన ఫొటోలు బయటకు రావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. శుభ్‌మన్ గిల్ సోదరితో కలిసి సారా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే ఇటు సారా టెండూల్కర్ కానీ, అటు శుభ్‌మన్ గిల్ కానీ తమ ప్రేమ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సచిన్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఈ లవ్ రూమర్స్‌ను కూడా కొట్టిపారేయలేదు. సారా టెండూల్కర్ వచ్చిన విశేషమో ఏమో కానీ వర్షం అంతరాయం కారణంగా తొలి రోజు ఆట రద్దయ్యింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్‌స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు.

ఇటీవలే సారా టెండూల్కర్ కొత్త బాధ్యతల్ని చేపట్టారు. సచిన్ టెండూల్కర్‌ ఫౌండేషన్‌ (ఎస్‌టీఎఫ్‌) డైరెక్టర్‌గా సారా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ 'ఎక్స్‌' (ట్విటర్) వేదికగా ప్రకటించారు. 'నా కుమార్తె సారా ఎస్‌టీఎఫ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత హ్యాపీగా ఉంది. తన కుమార్తెకు వైద్య, విద్యా రంగంపై ఉన్న నాలెడ్జ్ సమాజానికి మరింత తోడ్పడుతుంది' అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Story first published: Saturday, December 14, 2024, 13:59 [IST]
Other articles published on Dec 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+