Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఎవడ్రా వీడు.. బుమ్రాకే చుక్కలు చూపించాడు! (వీడియో)

ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్, 19 ఏళ్ల కుర్రాడు సామ్ కోన్‌స్టాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సామ్ కోన్‌స్టాస్.. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ముఖ్యంగా వరల్డ్ క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా‌పై విరుచుకుపడ్డాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా.. సామ్ కోన్‌స్టాస్‌ ధాటికి ఈ మ్యాచ్‌లో సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ నమోదైంది. అటాకింగ్ గేమ్‌తో బుమ్రాను బ్యాక్ ఫుట్‌లో పెట్టిన సామ్ కోన్‌స్టాస్.. మిగతా బౌలర్లపై కూడా అదే రీతిలో విరుచుకుపడ్డాడు.

IND vs AUS Sam Konstas reverse scoops as Jasprit Bumrah concedes first Test six since 2021

ఈ క్రమంలో 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సామ్ కోన్‌స్టాస్ ధాటికి బుమ్రా తొలి 6 ఓవర్లలోనే 38 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా వేసిన 7 ఓవర్ తొలి బంతిని స్కూప్ షాట్‌తో బౌండరీ బాదిన సామ్ కోన్‌స్టాస్.. ఆ మరుసటి బంతిని రివర్స్ స్కూప్‌తో సిక్సర్‌గా తరలించాడు. అదే ఓవర్‌ ఐదో బంతిని కూడా సామ్ కోన్‌స్టాస్ బౌండరీ తరలించాడు.

సామ్ కోన్‌స్టాస్‌‌ను విరాట్ కోహ్లీ కవ్వించగా.. ఈ 19 ఏళ్ల కుర్రాడు బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. కోహ్లీ చేసిన పనికి బుమ్రా బలయ్యాడు. బుమ్రా వేసిన 11వ ఓవర్‌లో కోన్‌స్టాస్ వరుసగా 4, 0, 2, 6, 4, 2 బాది 18 పరుగులు పిండుకున్నాడు.

సామ్ కోన్‌స్టాస్‌ ధాటికి బుమ్రాను పక్కనపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. రవీంద్ర జడేజాను రంగంలోకి దింపాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్న జడేజా.. సామ్ కోన్‌స్టాస్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పుల పెట్టిన బుమ్రాను సామ్ కోన్‌స్టాస్ చెడుగుడు ఆడాడు. దాంతో బుమ్రా ఫస్ట్ సెషన్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. బుమ్రా కెరీర్‌లోనే తొలి సెషన్‌లో వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి.

అసాధారణ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించిన సామ్ కోన్‌స్టాస్‌కు ప్రేక్షకులు, ఆ జట్టు ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సామ్ కోన్‌స్టాస్‌పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'ఎవడ్రా వీడు.. బుమ్రాకే చుక్కలు చూపించాడు'అని కామెంట్ చేస్తున్నారు. సామ్ కోన్‌స్టాస్ ధాటికి ఫస్ట్ సెషన్‌లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 112/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. క్రీజులో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఉన్నారు.

Story first published: Thursday, December 26, 2024, 8:41 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+