IND vs AUS: కోహ్లీతో గొడవపై సామ్ కోన్‌స్టాస్ ఏమన్నాడంటే..?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో గొడవపై ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్ చాలా హుందాగా స్పందించాడు. మైదానంలో జరిగిన ఘటనను అక్కడే వదిలేసానని, మైండ్‌లోకి అస్సలు తీసుకోలేని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయి కోన్‌స్టాస్‌తో గొడవ పడిన విషయం తెలిసిందే.
కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు. తనకు ఎదురుగా నడిచిన సామ్ కోన్‌స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్ని వారించారు.

ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటు చేసుకుంది. ఈ ఓవర్ పూర్తయిన అనంతరం సామ్ కోన్‌స్టాస్ మరో ఎండ్ వైపు నడుస్తుండగా.. కోహ్లీ డ్యాష్ ఇచ్చాడు. కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సహనం కోల్పోని సామ్ కోన్‌స్టాస్ బ్యాట్‌తోనే బదులిచ్చాడు. బుమ్రా వేసిన ఆ మరుసటి 11వ ఓవర్‌లో కోన్‌స్టాస్ వరుసగా 4, 0, 2, 6, 4, 2 బాది 18 పరుగులు పిండుకున్నాడు.
19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుబడుతున్నారు. ఫస్ట్ సెషన్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సామ్ కోన్‌స్టాస్.. కోహ్లీతో గొడవపై స్పందించాడు.
'మైదానంలో జరిగేవాటిని అక్కడే వదిలేస్తాను. గట్టి పోటీనివ్వడం అంటే నాకు చాలా ఇష్టం. కిక్కిరిసిన స్టేడియంలో అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుమించిన గొప్ప అరంగేట్రం లేదు. 80 వేల ప్రేక్షకుల ముందు పరుగులు చేయడం క్రేజీగా ఉంది. నేను స్వేచ్చగా ఆడేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో నాకు నేను అండగా నిలిచాను. నేను మరిన్ని పరుగులు చేయాల్సింది. బుమ్రా బౌలింగ్‌లో బంతి డౌన్‌లో వస్తే ర్యాంప్ షాట్స్‌తో టార్గెట్ చేయాలనుకున్నాను. అతను తిరిగి పుంజుకుంటాడని ఆశిస్తున్నా'అని సామ్ కోన్‌స్టాస్ చెప్పుకొచ్చాడు.
సామ్ కోన్‌స్టాస్ అదిరిపోయే ఆరంభంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. కోన్‌స్టాస్ ఫియర్ లెస్ గేమ్‌తో ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌లు కూడా స్వేచ్చగా ఆడారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఉస్మాన్ ఖవాజా ఔటైనా.. స్మిత్‌తో కలిసి మార్నస్ లబుషేన్(66 నాటౌట్)ను పెవిలియన్ చేర్చారు.
"Have a look where Virat walks. Virat's walked one whole pitch over to his right and instigated that confrontation. No doubt in my mind whatsoever."
— 7Cricket (@7Cricket) December 26, 2024
- Ricky Ponting #AUSvIND pic.twitter.com/zm4rjG4X9A
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications