IND vs AUS: చెత్త షాట్‌తో రోహిత్ శర్మ ఔట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఫ్లాట్ పిచ్‌పై చెత్త షాట్‌తో పెవిలియన్ చేరాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ 35 పరుగులే చేసి వెనుదిరిగాడు. 58 బంతులాడిన రోహిత్.. మూడు ఫోర్లు, సిక్స్‌తో రిథమ్‌లో కనిపించాడు. కానీ మాథ్యూ కుహ్నేమన్.. రోహిత్ శర్మ జోరుకు బ్రేక్ వేసాడు. కుహ్నేమన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని రోహిత్.. బ్యాక్ ఫుట్ పంచ్‌తో షార్ట్ కవర్ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా లబుషేన్ చేతిలో పడింది. కుహ్నేమన్‌తో కలిసి స్మిత్ పన్ని పన్నాగం సక్సెస్ అయ్యింది. దాంతో రోహిత్ తన షాట్‌పై తానే అసహనం వ్యక్తం చేస్తూ క్రీజును వీడాడు.
మండిపడుతున్న ఫ్యాన్స్..
ఇక చెత్త షాట్‌తోను వెనుదిరిగిన రోహిత్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ఫ్లాట్ వికెట్‌పై కూడా భారీ స్కోర్ చేయకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. తొలి టెస్ట్‌లో సెంచరీ మినహా.. ఈ సిరీస్‌లో రోహిత్ రాణించిందేం లేదని గుర్తు చేస్తున్నారు. 480 పరుగుల భారీ స్కోర్‌ను అధిగమించే లక్ష్యంతో దిగిన భారత్‌కు ఈ తరహా శుభారంభం పనికిరాదంటున్నారు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ కోసం ఎదురు చూసిన తమకు నిరాశే ఎదురైందని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ నిలకడలేమి ఆట కొనసాగుతుందని గుర్తు చేస్తున్నారు.
17 వేల పరుగులు..
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ 17 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ తరం క్రికెటర్లలో ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. 25047 పరుగులతో కోహ్లీ టాప్‌లో ఉండగా.. జోరూట్(18,048), డేవిడ్ వార్నర్(17059), రోహిత్ శర్మ(17011) కన్నా ముందున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఏడో బ్యాటర్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు. సచిన్, కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్.. రోహిత్ కన్నా ముందు ఈ ఘనతను అందుకున్నారు.

శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..
రోహిత్ శర్మ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(13 నాటౌట్)తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని గిల్.. రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చెరొక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications