టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మాకు క్వార్టర్ ఫైనల్ వంటిది. టోర్నీలో ముందడుగు వేయాలనుకుంటున్నాం. భారత్‌ను ఓడించడం కఠిన సవాలే. ఇలాంటి పరిస్థితులను గతంలో మేం చాలా సార్లు ఎదుర్కొన్నాం. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవాలంటే ఇక్కడి నుంచి మేం ప్రతీ మ్యాచ్ గెలవాలి. మా జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. మంచి సహాయక సిబ్బంది ఉంది. అగర్ స్థానంలో స్టార్క్ రీఎంట్రీ ఇచ్చాడు.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. దాంతో ఛేజింగ్ చేయాలనుకున్నాం. మేం ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేస్తాం.
ఇక్కడి కండిషన్స్‌ను వీలైనంత త్వరగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. సమష్టి ప్రదర్శనతో విజయం సాధిస్తాం. మెగా టోర్నీల్లో ప్రతీ మ్యాచ్ కీలకమే. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే తుది జట్టులో మార్పు చేయలేదు. పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. అందుకే సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఆసీస్‌కు కీలకం. అఫ్గానిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే భారత్‌పై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడినా.. రన్ రేట్ తగ్గకుండా చూసుకుంటే టీమిండియా సెమీస్ చేరుతోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.