Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: అందుకే తుది జట్టులో మార్పులు చేయలేదు: రోహిత్ శర్మ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ పొడిగా కనిపిస్తోంది. మా కుర్రాళ్లు కొన్ని ప్రాక్టీస్ సెషన్స్‌తో ఈ మ్యాచ్‌కు రెడీ అయ్యారు. పిచ్‌పై టర్న్ ఉండొచ్చు. ఇండియా బలమైన జట్టు. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్, స్పెన్సర్స్ జాన్సన్ స్థానంలో కూపర్ కన్నోల్లీ, సంఘా వచ్చారు.’ అని స్మిత్ పేర్కొన్నాడు.

వన్డేల్లో టీమిండియా వరుసగా 14 మ్యాచ్‌లోనూ టాస్ ఓడింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో సహా తాజా మ్యాచ్ వరకు వరుసగా టాస్ గెలవలేదు. టాస్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్‌కు తాము సన్నదమయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

IND vs AUS Rohit Sharma reveals the reason why India playing XI Unchanged against Australia in CT 2025 Semi final
Photo Credit: BCCI

'మేం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి సిద్దంగా ఉన్నాం. టాస్ విషయంలో అయోమయం ఉన్నప్పుడు ఓడిపోవడమే ఉత్తమం. పిచ్ తన సహజత్వానికి అనుగుణంగా మారనుంది. మెరుగైన క్రికెట్ ఆడాలి. గత మూడు మ్యాచ్‌ల్లో మేం మంచి క్రికెట్ ఆడాం. ఈ మ్యాచ్‌ మాకు సవాల్‌తో కూడుకున్నదే. మేం ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచే ప్రారంభించాలనుకుంటున్నాం. ఇప్పుడే మేం బౌలింగ్ చేస్తున్నాం. మేం కట్టడిగా బౌలింగ్ చేసి ఆసీస్‌ను వీలైనంత తక్కువ స్కోర్‌కు కట్టడి చేయాలి.'అని రోహిత్ శర్మ తెలిపాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

ఆస్ట్రేలియా: కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

Story first published: Tuesday, March 4, 2025, 14:21 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+