IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన ఘనత!

అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ ఫీట్ సాధించాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 17 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్.. మరో ఐదు పరుగులు చేయగానే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున 17 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో క్రికెటర్‌గా నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఏడో భారత బ్యాటర్‌గా..
సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 494 మ్యాచ్‌ల్లో 25,047 రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ 504 మ్యాచ్‌ల్లో 24,064, సౌరవ్ గంగూలీ 421 మ్యాచ్‌ల్లో 18,433, మహేంద్ర సింగ్ ధోనీ, 535 మ్యాచ్‌ల్లో 17,092 పరుగులతో రోహిత్ శర్మ కన్నా ముందున్నారు. ఈ తరం క్రికెటర్లలో ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. 25047 పరుగులతో కోహ్లీ టాప్‌లో ఉండగా.. జోరూట్(18,048), డేవిడ్ వార్నర్(17059), రోహిత్ శర్మ(17011) కన్నా ముందున్నారు.

సెంచరీ దిశగా గిల్..
సూపర్ షాట్లతో రిథమ్‌లో కనిపించిన రోహిత్ శర్మ.. మాథ్యూ కుహ్నేమన్ బౌలింగ్‌లో పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(13 నాటౌట్)తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని గిల్.. రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో భారత్ వికెట్ నష్టానికి 129 పరుగులతో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ఆసీస్.. 480
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చెరొక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications