టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిపై నోరుపారేసుకున్నాడు. రాయలేని పదాలతో బండ బూతులు తిట్టాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ రిషభ్ పంత్ నేలపాలు చేశాడు. కనీసం క్యాచ్ పట్టేందుకు కూడా ప్రయత్నించలేదు. దాంతో రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మైదానంలోనే పంత్‌ను బండ బూతులు తిట్టాడు. బుమ్రా సైతం రిషభ్ పంత్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

బుమ్రా వేసిన రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని బుమ్రా మార్ష్‌పై శరీరంపైకి వేయగా.. అతను డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని గ్లోవ్స్ తాకి వికెట్ కీపర్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం పరుగెత్తిన పంత్.. స్లిప్ అవ్వడంతో అందుకోలేకపోయాడు.
కనీసం డైవ్ కూడా చేయలేకపోయాడు. దాంతో రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. నోటి నుంచి వచ్చిన అసభ్య పదజాలాన్ని ఆపుకోలేకపోయాడు. పంత్‌పై కోపంతో అతని సోదరిని(బహెన్ **)అని తిట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92), సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.