ఇండోర్‌లో ఇండియా చెత్త రికార్డు.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా!

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచుకున్న ఆసీస్ స్పిన్నర్లు.. వరుస వికెట్లతో భారత్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. ఆసీస్ స్పిన్నర్ల డామినేషన్‌కు భారత బ్యాటర్లలో కోహ్లీ మినహా మరే బ్యాటర్ 50 బంతులు కూడా ఆడలేకపోయారు. దాంతో టీమిండియా తమ పేరిట చెత్త రికార్డు లిఖించుకుంది.

అతి తక్కువ బంతుల్లో..
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో అతి తక్కువ బంతుల్లోనే టీమిండియా ఆలౌటైంది. ఇంతకుముందు 2017లో పుణే టెస్ట్‌లో భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 40.1 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 33.5 ఓవర్లు మాత్రమే ఆడి ఆలౌట్ అయ్యింది. ఆ చెత్త రికార్డును తాజాగా రోహిత్ సేన అధిగమించింది.భారత్‌లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో టీమిండియాకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2004లో ముంబై టెస్ట్‌లో 104 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా.. 2017 పూణే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు, తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు కుప్పకూలింది.

రెండో భారత ప్లేయర్..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు జడేజా ఆదిలోనే షాకిచ్చాడు. ట్రావిస్ హెడ్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగులు 500 వికెట్లు తీసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు. కపిల్ దేవ్ ఒక్కడే జడేజా కంటే ముందు ఈ ఘనతను సాధించాడు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 11వ ప్లేయర్‌గా జడేజా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, షాన్ పోలాక్, చమిందా వాస్, డానియల్ విటోరి, జాక్వస్ కలీస్, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ జడేజా కంటే ముందున్నారు.
నోబాల్‌తో బౌల్డ్ చేసి..
ట్రావిస్ హెడ్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేసినా.. నోబాల్ కావడంతో అతను చాయించాడు.
ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా వికెట్ కోసం జడేజా రెండు సార్లు రివ్యూలు తీసుకొని వృథా చేశాడు. దాంతో అశ్విన్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఔటైనా రోహిత్ శర్మ రివ్యూ తీసుకోలేదు. రిప్లేలో ఔటని తేలడంతో అంతా విస్తుపోయారు. ఈ అవకాశాలను అందుకున్న లబుషేన్.. ఖవాజాతో కలిసి నిలకడగా ఆడుతున్నాడు. ఖవాజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆసీస్ భారత స్కోర్ ధాటేసి ముందుకు దూసుకెళ్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications