Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఇండోర్ లాంటి పిచ్ ఎక్కడా చూడలేదన్న హెడెన్.. సుద్దపూస మాటలే వద్దంటూ రవి శాస్త్రి కౌంటర్!

IND vs AUS: Ravi Shastri has epic response after Matthew Hayden slams Indore pitch

ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా టర్నింగ్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో వికెట్‌పై భారత మాజీ క్రికెట్లతో పాటు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యకం చేశాడు. ఈ తరహా పిచ్‌ను ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదన్నాడు.

ఇలాంటి పిచ్ ఎక్కడా చూడలేదు..

ఇలాంటి పిచ్ ఎక్కడా చూడలేదు..

భారత ఇన్నింగ్స్ సందర్భంగా రవి శాస్త్రితో కలిసి కామెంట్రీ చెప్పిన హెడెన్.. ఈ పిచ్‌పై తనకు ఫిర్యాదులున్నాయని తెలిపాడు. 'భారత శిభిరంలో ఒక నిశ్శబ్దం అలుముకుంది. గడిచిన రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మాత్రం టర్నింగ్ ట్రాక్ ఆడలేక ఇబ్బంది పడుతోంది. నాకు తెలిసి ప్రపంచంలోనే ఈ తరహా పిచ్‌ను ఎక్కడా చూడలేదు. ఈ పిచ్‌పై నాకు కంప్లెయింట్స్ ఉన్నాయి. ఈ ఇండోర్ వికెట్‌పై యారేజ్ టర్న్ 4.8 డిగ్రీలుగా ఉంది. ఇది మాములు టర్న్ కాదు.

మూడు రోజుల్లోనే..

మూడు రోజుల్లోనే..

ఇలాంటి టర్న్‌ను టెస్ట్ క్రికెట్‌లో మూడు లేదా నాలుగో రోజు ఆటలో చూస్తాం. కానీ ఈ మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్ తొలి గంటలోనే చూస్తున్నాం. దాంతో బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియనుంది. ఇలాంటి వికెట్స్ టెస్ట్‌లకు పనికిరావు.'అని హెడెన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు రవి శాస్త్రి స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. ఎవరి సొంతగడ్డపై అయినా ఇలాంటి పిచ్‌లే ఉంటాయని, సుద్దపూస మాటలు మాట్లాడవద్దని బదులిచ్చాడు.

హోం కండిషన్స్ అంటేనే..

హోం కండిషన్స్ అంటేనే..

'హోం కండిషన్స్‌లో మ్యాచ్ అంటే సాధారణంగా జరిగేదే ఇదే. కానీ ఇక్కడ పరిస్థితులు ఇంకా కఠినంగా కనిపిస్తున్నాయి. ఒక్క మంచి పార్ట్‌నర్‌షిప్ నమోదు చేస్తే సరిపోతుంది'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. సొంతగడ్డపై ఎవరికి అనుకూలంగా వారు వికెట్స్ తయారు చేసుకోవడం సర్వ సాధారణం. ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు పేస్, బౌన్సీ పిచ్‌లతో ప్రత్యర్థి జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఇబ్బంది పెట్టడం చాలా సార్లు చూశామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 109 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(22), శుభ్‌మన్ గిల్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లు తీయగా.. నాథన్ లయన్ మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమాయనికి 4 వికెట్లకు 156 పరుగులు చేసి 47 పరుగుల ఆధిక్యం సాధించింది. ఉస్మాన్ ఖవాజా(60) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Wednesday, March 1, 2023, 17:17 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+