టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న సెయింట్ లూసియా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం ధాటికి మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మైదానంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.
ఒకవేళ వర్షం ఆగినా.. ఆటకు మైదానాన్ని సిద్దం చేసేందుకు చాలా సమయం పట్టనుంది. ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా టీమిండియాకు వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పటికే అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఓడించి రెండు విజయాలు నమోదు చేసిన టీమిండియా.. సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినా గ్రూప్-1 టాపర్‌గా సెమీస్‌కు అర్హత సాధించనుంది.

కానీ ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ జరగడం చాలా కీలకం. అఫ్గానిస్థాన్‌తో గత మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అయితే విజయం సాధించినా ఆసీస్ సెమీస్ ఆశలకు నెట్‌రన్‌రేటు ఎంతో కీలకం కానుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడాలి. లేకుంటే మ్యాచ్‌ను రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయిస్తారు.
అదే జరిగితే ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్స్ చేరుతాయి. అప్పుడు అఫ్గాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆసీస్ టోర్నీలో ముందడుగు వేస్తోంది.
ఒక వేళ బంగ్లాదేశ్‌పై అఫ్గాన్ విజయం సాధిస్తే మాత్రం 4 పాయింట్స్‌తో ఆ జట్టే టోర్నీలో ముందడుగు వేస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.