Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: నాగ్‌పూర్ పిచ్‌పై రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి.. క్యూరేటర్‌పై కన్నెర్ర చేయడంతో..!

IND vs AUS: Rahul Dravid unhappy with Nagpur pitch, Curator doctors pitch for spin

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో చర్చంతా పిచ్‌ల చుట్టూనే తిరుగుతోంది. భారత్‌ తమకు అనుకూలంగా ఉండే స్పిన్ వికెట్‌లను తయారు చేసుకుంటుందని ఆస్ట్రేలియా మీడియాతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలను ఏ మాత్రం పట్టించుకోని భారత్‌.. పిచ్‌లు తమకు అనుకూలంగా ఉండే విధంగా సిద్దం చేసుకుంటోంది. భారత్‌లోని పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి టర్నర్ వికెట్‌ను సిద్దం చేయాలని క్యూరేటర్‌ను కోరింది.

రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి..

రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి..

అయితే నాగ్‌పూర్ టెస్ట్ కోసం సిద్దం చేసిన పిచ్‌‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి 72 గంటల ముందు పిచ్‌ను మార్చాలని క్యూరేటర్‌ను ద్రవిడ్ కోరినట్లు జాగరన్ వెబ్‌సైట్ పేర్కొంది. గత రెండు, మూడు రోజులుగా భారత జట్టు తొలి టెస్ట్ జరగనున్న వీసీఏ స్డేడియం సెంటర్ వికెట్‌పై ప్రాక్టీస్ చేసింది. ఉన్నట్టుండి ద్రవిడ్ మ్యాచ్ ప్రారంభానికి మూడు రోజుల ముందు పిచ్ మార్చాలని కోరడంతో అధికారులు, క్యూరేటర్స్ రాత్రి, పగలు కొత్త పిచ్‌ను సిద్దం చేయడం కోసం శ్రమిస్తున్నారని తెలుస్తోంది. పిచ్‌ను మార్చితే సైట్ స్క్రీన్స్‌ను కూడా దానికి తగ్గట్లు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం..

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం..

వాస్తవానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లను సిద్దం చేసి.. ఐదు రోజుల పాటు మ్యాచ్ సాగే వికెట్లను రూపొందించాలని నిర్ణయించారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ కోరిక మేరకు టర్నర్ వికెట్స్‌ను తయారు చేస్తున్నారు. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం కీలకం కావడంతో అనుకూలంగా ఉండే పిచ్‌లు రూపొందించడంపై ఫోకస్ పెట్టారు. సొంతగడ్డపై ఉండే అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటూ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌ల్లో ఆడాలని టీమిండియా భావిస్తుంది.

అడ్వాంటేజ్‌ను వాడుకోవాలనే..

అడ్వాంటేజ్‌ను వాడుకోవాలనే..

ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మీడియా ఇప్పటికే పిచ్‌లపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ టెస్ట్‌లో తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వనుంది. తమకు ఉన్న నలుగురు స్పిన్నర్లతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌పై టీమిండియా కన్నేసింది. గత కొన్నేళ్లుగా సొంతగడ్డపై టీమిండియా టర్నింగ్ ట్రాక్‌ల్లోనే ఆడి విజయాలందుకుంది.

అప్పుడు అట్టర్ ఫ్లాఫ్..

అప్పుడు అట్టర్ ఫ్లాఫ్..

అయితే 2004లో ఇదే నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఇలానే టర్నర్ వికెట్ కోసం పట్టుబట్టి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 342 పరుగులతో గెలుపొందింది. ఇటీవల ద్రవిడ్ కూడా న్యూజిలాండ్‌తో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరి నిమిషంలో పిచ్‌ను మార్చమని కోరగా.. వికెట్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా మారి వివాదాస్పదమైంది. ఇప్పుడు నాగ్‌పూర్ టెస్ట్‌లోనూ పిచ్ మార్చుతుండటంతో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించనున్నారు.

Story first published: Wednesday, February 8, 2023, 16:03 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+