Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: అంపైర్ తప్పుడు నిర్ణయానికి విరాట్ కోహ్లీ బలి.. మండిపడ్డ రాహుల్ ద్రవిడ్! (వీడియో)

IND vs AUS: Rahul Dravid looks unhappy with the umpires decision on Virat Kohli dismissal

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 4 ఫోర్లతో 44) అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది అన్యాయమైన నిర్ణయమని రియాక్షన్ ఇచ్చారు. కోహ్లీ సైతం అంపైర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ క్రీజును వీడాడు. డగౌట్‌లో రిప్లే చూసి మరింత షాక్‌కు గురయ్యాడు.

అసలేం జరిగిందంటే..?

ప్రస్తుతం విరాట్ కోహ్లీ వికెట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. అభిమానులు అంపైర్‌పై మండిపడుతున్నారు. రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్న ప్రయత్నం చేశాడు. ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం జడేజా(26) ఔటైనా.. కోహ్లీ సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియ యువ స్పిన్నర్ మాథ్యూ కున్నేమన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఇక అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు.

బ్యాట్, ప్యాడ్ ఒకేసారి తాకిన బంతి..

రిప్లేలో బంతి.. బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. దాంతో థర్డ్ అంపైర్... బంతి బ్యాటన్‌ను ముందుగా తాకినట్లు ఆధారాలు లేవని, ఫీల్డ్ అంపైర్‌కు కట్టుబడి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకుతూ అంపైర్స్ కాల్‌గా వెళ్లింది. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ విషయంలో మీనన్ తప్పు చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా ఇలానే చేశాడని ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

అంపైర్ల ఘోర తప్పిదం..

కొందరు మాత్రం బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాటర్ రూల్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. అంపైర్ తప్పిదం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపనుందని, ఇంత టెక్నాలజీ ఉన్నా.. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇక పుజారా విషయంలోనూ ఈ తరహా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అతను ఔటైనా నాటౌటిచ్చారని గుర్తు చేస్తున్నారు.

ఆదుకున్న అక్షర్ పటేల్..

21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. అక్షర్ పటేల్(115 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 74) సూపర్ బ్యాటింగ్‌తో 262 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 4 ఫోర్లతో 44), రవీంద్ర జడేజా(74 బంతుల్లో 4 ఫోర్లతో 26) రాణించారు. రవిచంద్రన్ అశ్విన్(71 బంతుల్లో 5 ఫోర్లతో 37)తో కలిసి అక్షర్ పటేల్ 8వ వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ ఐదు వికెట్లు తీయగా.. టాడ్ మర్ఫీ, మాథ్యూ రెండేసి వికెట్లు పడగొట్టారు. కమిన్స్ ఓ వికెట్ దక్కింది.

Story first published: Saturday, February 18, 2023, 14:24 [IST]
Other articles published on Feb 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+