Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేమే కాదు.. అన్ని దేశాల్లోనూ ఇంతే: రాహుల్ ద్రవిడ్

IND vs AUS: Rahul Dravid defends playing on turners ahead of Ahmedabad Test

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని స్పిన్ పిచ్‌లపై ఆడుతున్నందుకు తాము ఏం విచారించడం లేదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అన్న దేశాలు తమకు అనుకూలమైన పిచ్‌లపైనే ఆడుతున్నాయని స్పష్టం చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో పాయింట్లే ముఖ్యం కాబట్టి అన్ని జట్లు గెలుపు మీదే దృష్టిసారించాయని తెలిపాడు. ఈ క్రమంలోనే అన్ని దేశాలు ఫలితాల ఆధారిత పిచ్‌లు సిద్ధం చేస్తున్నాయని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఇండోర్‌ పిచ్‌ 'పేలవం'గా ఉందంటూ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ రేటింగ్‌ ఇవ్వడంతో స్పిన్‌ వికెట్లపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌ స్పందించాడు. అహ్మదాబాద్ టెస్ట్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడాడు.

'ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇవ్వడంపై నేను లోతుల్లోకి వెళ్లను. అభిప్రాయం చెప్పే అర్హత మ్యాచ్‌ రిఫరీకి ఉంటుంది. అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానా? లేదా? అన్నది కూడా అవసరం లేదు. నేను ఏమనుకుంటున్నానన్నది కూడా అనవసర విషయం. అయితే డబ్ల్యూటీసీ పాయింట్లు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫలితాలు వచ్చే పిచ్‌లపై ఆడాల్సి వస్తుంది. ఒక్క భారత్‌లోనే కాదు అన్ని దేశాల్లో ఇదే జరుగుతుంది.

IND vs AUS: Rahul Dravid defends playing on turners ahead of Ahmedabad Test

టెస్టుల్లో ఫలితాలు కీలకంగా మారడంతో అందరూ అనుకూల పిచ్‌లు సిద్దం చేసుకుంటున్నారు. విజయానికి 12, డ్రాకు 4 పాయింట్లు ఉన్నప్పుడు ఎవరైనా గెలుపు కోసమే ప్రయత్నిస్తారు. విదేశాలకు వెళ్లినప్పుడు సవాళ్లతో కూడుకున్న వికెట్లపై మేం ఆడాం. 2022లో సౌతాఫ్రికాలో ఆడినప్పుడు మ్యాచ్‌లో స్పిన్నర్లకు అవకాశమే రాలేదు. ఆస్ట్రేలియాలోనూ పేస్ పిచ్‌లే కనిపించాయి. 'అని రాహుల్ ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. కీపింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో రాణించిలేకపోతున్న భరత్‌ను వెనకేసుకొచ్చాడు. టర్నింగ్ ట్రాక్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసాడని, ఢిల్లీ టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడాలంటే కాస్త లక్ కూడా కావాలన్నాడు.

Story first published: Wednesday, March 8, 2023, 11:07 [IST]
Other articles published on Mar 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+