భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరైన విషయం తెలిసిందే. దాదాపు 87 వేల మంది ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు మైదానానికి వచ్చారు. అయితే రెండో రోజు ఆటలో ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.
దాంతో ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని మైదానం బయటకు తీసుకెళ్లారు. మైదానంలోకి దూసుకొచ్చిన సదరు అభిమాని 'ఫ్రీ ఉక్రెయిన్'అనే టీషర్ట్ ధరించాడు. మైదానంలోకి అడుగుపెట్టిన అతను నేరుగా కోహ్లీ దగ్గరకు వచ్చి అతని భుజాలపై చేతులేసాడు. మెడపట్టి తన దగ్గరకు లాగుకున్నాడు. కోహ్లీ కూడా అతనికి సహకరించాడు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే అభిమాని నేరుగా కోహ్లీ దగ్గరకు వెళ్లడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. తొలి రోజు ఆటలో కోహ్లీ.. ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాన్‌ను భుజంతో ఢీకొట్టడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోహ్లీని ఆసీస్ ఫ్యాన్స్ గేలి చేశారు. ఈ క్రమంలో అభిమాని మైదానంలోకి దూసుకొస్తూ కోహ్లీ దగ్గరకు వెళ్లడంతో అతనిపై దాడి చేస్తారా? అని భయపడ్డారు. కానీ సదరు అభిమాని కోహ్లీ భుజాలపై చేతులేసి చిందేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లీ భుజాలపై చేతులు వేసాడు.
311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్‌కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు. మహమ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 5.30 ఎకానమీతో 122 పరుగులిచ్చుకున్నాడు. అతని కెరీర్‌లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్. సిరాజ్ వైఫల్యం ఆసీస్‌కు కలిసిరాగా.. టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది.
Pitch invader huggs Kohli 😭 pic.twitter.com/RAz81zkfWc
— rR (@ryandesa_7) December 27, 2024
It might sound uncanny, but the pitch invader today seems to be the same individual, Wen Johnson, who disrupted play during the ODI World Cup final at the Narendra Modi Stadium when Virat and KL Rahul were batting against Australia. 🏏🤯 #AUSvIND #MCG pic.twitter.com/HqUPkocYYb
— APNU GUJARAT NEW ZEALAND (@APNU_GUJARAT_NZ) December 27, 2024