ఆస్ట్రేలియా బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్ చరిత్ర సృష్టించారు. ఈ నలుగురు బౌలర్లు సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో ఈ నలుగురు కలిసి 500 వికెట్ల మైలు రాయి అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి సెట్ బౌలర్లుగా చరిత్రకెక్కారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ నలుగురు ఆసీస్ బౌలర్లు ఈ ఫీట్ సాధించారు. ఈ నలుగురు బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 130 వికెట్లు, మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్ 124 వికెట్లు తీయగా.. నాథన్ లయన్ 122 వికెట్లు పడగొట్టాడు.

ఈ జాబితాలో ఆసీస్ బౌలర్ల సెట్ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు ఉన్నారు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ 415 వికెట్లు తీసారు. ఓవరాల్‌గా నాథన్ లయన్ 130 మ్యాచ్‌ల్లో 530 వికెట్లు తీసారు. మిచెల్ స్టార్క్ 90 మ్యాచ్‌ల్లో 360 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ 71 మ్యాచ్‌ల్లో 275 వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్ 63 మ్యాచ్‌ల్లో 269 వికెట్లు తీసాడు.
పెర్త్ టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. తెలుగు తేజం, అరంగేట్ర ప్లేయర్ 0037)పర్వాలేదనిపించాడు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్(0), దేవదత్ పడిక్కల్(0) డకౌటవ్వగా.. విరాట్ కోహ్లీ(5), ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) తీవ్రంగా నిరాశపరిచారు. థర్డ్ అంపైర్ తప్పిదం కేఎల్ రాహుల్(26) వెనుదిరిగాడు. పంత్, నితీష్ కుమార్ రెడ్డి 48 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 150 పరుగుల మార్క్ అందుకోగలిగింది.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి ఓపెనర్లు ఉష్మాన్ ఖవాజా(8), నిథన్ మెక్‌స్వీనీ(10)తో పాటు స్టీవ్ స్మిత్(0) పెవిలియన్ చేరారు. స్మిత్ గోల్డెన్ డకౌటవ్వడం విశేషం.