Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: తెలుగోడి క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. చాలా దూరం పరుగెత్తి సూపర్ డైవ్‌తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు.

ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న నితీష్ కుమార్ రెడ్డిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తెలుగోడి క్యాచ్.. పోలా అదిరిపోలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

IND vs AUS Nitish Kumar Reddy Takes Stunning Catch to Dismiss Pat Cummins During Boxing Day Test

నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్‌తో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 105వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని జడేజా ఆఫ్ స్టంప్ లైన్‌లో వేయగా ప్యాట్ కమిన్స్ భారీ షాట్ ఆడాడు. కానీ సరిగ్గా తాకని బంతి ఓవర్ మిడాన్ దిశగా గాల్లోకి లేచింది.

కవర్స్ నుంచి పరుగెత్తుకొచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. క్యాచ్ అందుకోవడంతో పాటు ఏడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) సెంచరీతో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే 4 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్‌కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు.

Story first published: Friday, December 27, 2024, 8:37 [IST]
Other articles published on Dec 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+