Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియా కొంపముంచిన కెప్టెన్, వైస్ కెప్టెన్!

IND vs AUS: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(8) మరోసారి విఫలమయ్యాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమైన శ్రేయస్ అయ్యర్.. సుదీర్ఘ విశ్రాంతి అనంతరం బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనూ తడబడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20తో రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్ 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.

వైస్ కెప్టెన్సీ హోదాలో జట్టులోకి వచ్చిన అయ్యర్.. తన్వీర్ సంఘా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1) కూడా ఔటవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. తర్వాతి బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురవ్వడం ధాటిగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

IND vs AUS: Netizens troll Shreyas Iyer after forgettable outing vs Australia in 4th T20I

శ్రేయస్ అయ్యర్ కోసం ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మను పక్కనపెట్టారు. కానీ అయ్యర్ తీవ్రంగా నిరాశపరచడంతో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ ఓటమితో పాటు తాజా మ్యాచ్‌లోనూ టీమిండియాకు అయ్యర్ కష్టాలు తెచ్చిపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్‌ను టీ20 ఫార్మాట్‌ నుంచి దూరం పెట్టాలని, కుర్రాళ్లకే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. రింకూ సింగ్ లేకుంటే టీమిండియా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని, కోహ్లీ తరహాలో ఆడటం శ్రేయస్ అయ్యర్ వల్ల కాదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది.

జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 14 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి.

Story first published: Friday, December 1, 2023, 22:05 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+