Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: మళ్లీ నోరు జారిన సంజయ్ మంజ్రేకర్.. దక్షిణాది ఆటగాళ్లపై వివక్ష అంటూ మురళీ విజయ్ ఫైర్!

IND vs AUS: Murali Vijay slams Sanjay Manjrekar for surprised remark at his stat exceeding Rohit

నాగ్‌పూర్: టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ మళ్లీ నోరు జారాడు. గతంలో రవీంద్ర జడేజా, హర్షభోగ్లేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి సుదీర్ఘ కాలం పాటు వేటుకు గురైన మంజ్రేకర్.. మళ్లీ అదే తరహా కామెంట్రీతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ మురళీ విజయ్‌‌ను తక్కువ చేస్తూ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఈ కామెంట్స్‌పై మురళీ విజయ్ ఘాటుగా స్పందించాడు. దక్షిణాది ఆటగాళ్లను ప్రశంసించడానికి ముంబై ఆటగాళ్లకు మనసొప్పదని ట్వీట్ చేశాడు. దాంతో దక్షిణాది అభిమానులు మురళీ విజయ్‌కు మద్దతుగా నిలుస్తూ.. మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌కు సంజయ్ మంజ్రేకర్ కామెంటేటర్‌‌గా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై అద్భుతంగా ఆడిన హిట్ మ్యాన్.. కెరీర్‌లో 9వ శతకం సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా అతను తన పేరిట లిఖించుకున్నాడు.

స్వదేశంలో అత్యధిక 50+ పరుగులు సాధించిన బ్యాటర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే జాబితాలో మురళీ విజయ్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ లిస్ట్‌ను చూసిన సంజయ్ మంజ్రేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మురళీ విజయ్ అగ్రస్థానంలో ఉండటం చాలా సర్‌ప్రైజ్‌డ్‌గా ఉందని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దక్షిణాది ఆటగాళ్లు అంటేనే..

సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన మురళీ విజయ్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించాడు.'సర్‌ప్రైజ్‌డ్ వావ్‌.. ''ముంబైకి చెందిన మాజీ క్రికెటర్లు దక్షిణాది ఆటగాళ్లను ప్రశంసించడానికి మనసొప్పదు' అని మురళీ విజయ్‌ పోస్టులు పెట్టాడు. అభిమానులు సైతం విజయ్‌‌కు మద్దతుగా నిలుస్తూ మంజ్రేకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామెంట్రీ ప్యానెల్ నుంచి వేటు వేసినా బుద్ది రాలేదని అదే తరహా ప్రవర్తన కనబరుస్తున్నాడని మండిపడ్డారు. దక్షిణాది ఆటగాళ్లపై వివక్ష చాలా రోజుల నుంచి ఉందని, ఈ విషయాన్ని క్రికెటర్లు బయటపెట్టడం లేదని మరికొందరు కామెంట్ చేశారు.

వివరణ ఇచ్చిన సంజయ్‌

వివరణ ఇచ్చిన సంజయ్‌

మురళీ విజయ్‌ చేసిన ట్వీట్ల‌పై సంజయ్‌ మంజ్రేకర్ స్పందించాడు. తాను అలా ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటో వివరించాడు. 'రోహిత్ శర్మ ఇప్పుడు స్వదేశంలో 8 శతకాలు సాధించాడు. కన్వర్షన్‌ రేట్‌లో (50+ పరుగులు) రెండో స్థానానికి వచ్చాడు. ఇదే జాబితాలో మురళీ విజయ్‌ అగ్రస్థానంలో ఉండటం విశేషం.

అతనిలా ఆడిన ఇన్నింగ్స్‌లను మరిచిపోలేం. మొత్తం 12 సెంచరీల్లో తొమ్మిది స్వదేశంలోనే చేసి కన్వర్షన్ రేట్‌లో టాప్‌లో ఉన్నాడు'' అని వ్యాఖ్యానించాడు. గతనెలలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మురళీ విజయ్‌ తన కెరీర్‌లో 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.

Story first published: Saturday, February 11, 2023, 8:52 [IST]
Other articles published on Feb 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+