Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: సిరాజ్ అత్యుత్సాహం.. లబుషేన్‌‌ను బంతితో కొట్టిన డీఎస్పీ! (వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ హద్దులు దాటాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సిరాజ్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయి ప్రత్యర్థి బ్యాటర్‌ పైకి బంతిని విసిరేసాడు. సిరాజ్ చర్య పట్ల అంపైర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిదంటే..?
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ వేసిన 25వ ఓవర్ నాలుగో బంతిని ఆడేందుకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ నిరాకరించాడు. సిరాజ్ రనప్ పూర్తి చేసి బంతి వేసే క్రమంలో క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సిరాజ్.. బ్యాటర్‌‌వైపు బంతిని విసిరేసాడు.

IND vs AUS Mohammed Siraj Throws Ball Angrily Towards Marnus Labuschagne Video

దాంతో సహనం కోల్పోయిన లబుషేన్.. సిరాజ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ధి చెప్పాడు. సిరాజ్‌ను మందలించాడు. సైట్ స్క్రీన్‌కు అడ్డంగా ఓ అభిమాని రావడంతో లబుషేన్ బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించాడు.

అయితే సిరాజ్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ డీఎస్పీ అయిన సిరాజ్ ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ అనంతరం నిబంధనల మేరకు సిరాజ్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఆసీస్‌దే ఆధిపత్యం..
ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో టీమిండియా తేలిపోయింది. డే/నైట్ జరుగుతున్న ఈ పింక్ బాల్ టెస్ట్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13) విఫలమైనా.. నాథన్ మెక్‌స్వీనీ(97 బంతుల్లో 6 ఫోర్లతో 38 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(67 బంతుల్లో 3 ఫోర్లతో 20 బ్యాటింగ్) జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో నిలబడ్డారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకే ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది.

భారత్ 180 ఆలౌట్..
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) దూకుడుగా ఆడగా.. కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, December 6, 2024, 19:02 [IST]
Other articles published on Dec 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+