Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: నిప్పులు చెరిగిన డీఎస్పీ సిరాజ్.. కుప్పకూలిన ఆసీస్!

ఐదు టెస్ట్‌లో బోర్డర్ గవావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 86/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది.

ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/98), జస్‌ప్రీత్ బుమ్రా(4/61) నాలుగేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

IND vs AUS Mohammed Siraj gets 4-fer Australia lead by 157 runs

ట్రావిస్ హెడ్ విధ్వంసం..
రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(39)ని బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(2) కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో లబుషేన్, ట్రావిస్ హెడ్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో చెలరేగాడు.

55 పరుగుల భాగస్వామ్యంతో పాతుకుపోయిన ఈ జోడీని నితీష్ కుమార్ రెడ్డి విడదీసాడు. లబుషేన్‌ను జైస్వాల్ సాయంతో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ రాగా.. ట్రావిస్ హెడ్ 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్ 200/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

111 బంతుల్లో శతకం..
రెండో సెషన్ ఆరంభంలోనే మిచెల్ మార్ష్‌(9)ను అశ్విన్.. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అతను 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అలెక్స్ క్యారీ(15)ని సిరాజ్ ఔట్ చేయడంతో 6వ వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాసగ్వామ్యానికి తెరపడింది.

సెంచరీ అనంతరం ట్రావిస్ హెడ్ మరింత దూకుడుగా ఆడాడు. కానీ అతన్ని సిరాజ్ స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్యాట్ కమిన్స్(12)ను బుమ్రా ఔట్ చేయడంతో ఆసీస్ 332/8 టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్ తొలి బంతికే మిచెల్ స్టార్క్‌ను సిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో స్కాట్ బోలాండ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

భారత్ 180 ఆలౌట్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) దూకుడుగా ఆడగా.. కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Saturday, December 7, 2024, 15:35 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+