టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ పేలవ ప్రదర్శన కొనసాగడంపై మండిపడుతున్నారు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు.
23 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 5.30 ఎకానమీతో 122 పరుగులిచ్చుకున్నాడు. అతని టెస్ట్ కెరీర్‌లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్. సిరాజ్ వైఫల్యం ఆసీస్‌కు కలిసి రాగా.. భారత్‌కు తీవ్ర నష్టం చేసింది.

311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్‌కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు. ఒక ఎండ్‌లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మరో ఎండ్‌లో సిరాజ్ అతనికి సహకారం అందించలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకుండా పరుగులివ్వడంతో ఆసీస్ బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు.
ఈ మ్యాచ్‌లోనే కాదు ఈ సిరీస్‌లోనే సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో(2/20, 3/51) ఐదు వికెట్లతో పర్వాలేదనిపించిన సిరాజ్.. రెండో టెస్ట్‌లో (4/98, 0/9) నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. మూడో టెస్ట్‌లోనూ(2/97, 2/36)నాలుగు వికెట్లే తీసాడు. బుమ్రా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు తీస్తే సిరాజ్..14 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని బౌలింగ్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీస్తోంది.
ఈ క్రమంలోనే సిరాజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రిటైర్మెంట్ ప్రకటించి హైదరాబాద్‌కు వచ్చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్పీ ఉద్యోగం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, పుష్ప తొక్కిసలాట కేసు హాట్ టాపిక్‌గా మారిందని, ఆ కేసును టేక్ ఓవర్ చేయాలని సెటైర్లు పేల్చుతున్నారు.
Congratulations to Indian fast bowler Mohammed Siraj for an outstanding century in the Boxing Day Test! What an asset he is to Australia #AUSvIND pic.twitter.com/cbj4Ee7Yb7
— Aidan Edgecomb (@AidanEdgecomb6) December 27, 2024
This is how Australian batters took on Mohammed Siraj 🤕#INDvsAUS #BoxingDayTest #INDvAUS pic.twitter.com/qQiUTxlbys
— Siju Moothedath (@SijuMoothedath) December 27, 2024
Reviews wasted -3
— Cute Lassi 🥤 (@yorkerking01) December 27, 2024
Runs given -120
Attitude shown -♾
Fights - in every spell he bowled
This is a Haram, Mohammed siraj. pic.twitter.com/6K0jcigYnx
SIRAJ is finished??
— Cricket360 (@CrickTak) December 27, 2024
Attitude- Next Level
Bowling -Zero
What a liability Mohammed Siraj is for team India.Except for unnecessary aggressions he can't take a single wicket.#INDvsAUS #AUSvIND pic.twitter.com/6C60uWDHu1