IND vs AUS: సిక్సర్లతో కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన మహమ్మద్ షమీ!

నాగ్‌పూర్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో బ్యాటింగ్‌లో మెరిసిన షమీ.. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్‌లను అధిగమించాడు. మూడో రోజు ఆటలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహమ్మద్ షమీ.. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.
ముర్ఫీ వేసిన 131వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన షమీ.. అంతకు ముందో ఓ భారీ సిక్సర్ కొట్టాడు. మొత్తం మూడు సిక్స్‌లతో విరాట్ కోహ్లీని వెనక్కునెట్టాడు. టెస్ట్‌ల్లో మహమ్మద్ షమీ ఇప్పటి వరకు 25 సిక్స్‌లు బాదగా.. కోహ్లీ(24), యువరాజ్ సింగ్(21), కేఎల్ రాహుల్(17) కన్నా ముందున్నాడు.

టాప్‌లో బెన్ స్టోక్స్..
టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ల జాబితాలో 107 సిక్సర్లతో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్(91) ఒక్కడే టాప్-6లో ఉన్నాడు. అసాధారణ బ్యాటింగ్‌తో 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసిన షమీ.. అక్షర్ పటేల్‌తో కలిసి 9వ వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. దాంతో షమీపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాంగాన్‌లో షమీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బోలాండ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రెచ్చి పోయిన షమీ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

243 పరుగుల ఆధిక్యం..
ఇక 321/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 139.3 ఓవర్లలో 400 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్‌కు 243 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 84), మహమ్మద్ షమీ రాణించారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్ ఓ వికెట్ తీసాడు.

ఐదేసిన అశ్విన్..
243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(5/37) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. జడేజా(2/34), మహమ్మద్ షమీ(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 400 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 91 ఆలౌట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications