Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియాను ఆదుకున్న తెలుగోడు!

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. మరోసారి తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకోవడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేయగలిగింది.

1
60521

నితీష్ కుమార్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ(7), రోహిత్ శర్మ(3) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు.

IND vs AUS Mitchell Starc takes career-best 6 48 Nitish Kumar Reddy pulls India to 180 all-out

యశస్వి గోల్డెన్ డక్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే యశస్వి జైస్వాల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డవాటిని బౌండరీలకు తరలించింది. 69 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మిచెల్ స్టార్క్ విడదీసాడు.

హాఫ్ సెంచరీకి చేరువైన రాహుల్‌(37)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కోహ్లీ(7) కూడా స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్(31)ను స్కాట్ బోలాండ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 82/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ఆదుకున్న నితీష్ రెడ్డి..
రెండో సెషన్ ఆరంభంలోనే రోహిత్ శర్మ(3)ను స్కాట్ బోలాండ్.. ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. నిలకడగా ఆడుతున్న రిషభ్ పంత్‌ను కమిన్స్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో భారత్ 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా అశ్విన్.. 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని స్టార్క్ విడదీసాడు.

అశ్విన్(22)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అదే ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడాడు. ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్‌, కవర్ డ్రైవ్‌లతో బౌండరీలు రాబట్టాడు. బుమ్రాను కమిన్స్ ఔట్ చేయగా.. దూకుడుగా ఆడే క్రమంలో స్టార్క్ బౌలింగ్‌లో నితీష్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో భారత తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ ఇలానే దూకుడుగా ఆడి భారత్‌కు మెరుగైన స్కోర్ అందించాడు.

Story first published: Friday, December 6, 2024, 14:48 [IST]
Other articles published on Dec 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+