Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కుల్దీప్ యాదవ్‌ను తిట్టిన రోహిత్, కోహ్లీ!(వీడియో)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయారు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై నోరు పారేసుకున్నారు. రాయలేని పదాలతో బండ బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ వేసిన 32వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని స్మిత్ డీప్ మిడ్ వికెట్‌ దిశగా ఆడి సింగిల్ తీసాడు. అక్కడే ఫీల్డింగ్ చేసిన కోహ్లీ వేగంగా బంతిని అందుకొని కుల్దీప్ వైపు త్రో వేసాడు. అయితే ఈ బంతిని అందుకోకుండా కుల్దీప్ యాదవ్ వదిలేసాడు. బ్యాకప్‌గా రోహిత్ శర్మ ఉండటంతో ఎక్స్‌ట్రా రన్స్ రాలేదు.

IND vs AUS Kuldeep Yadav Faces Heat From Rohit Sharma And Virat Kohli After Massive Blunder

కుల్దీప్ బంతి వదిలేయడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ.. అసభ్య పదజాలంతో తిట్టాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ సైతం కుల్దీప్ యాదవ్‌ను మందలించాడు. ఇద్దరిని పట్టించుకోకుండా.. వెళ్లిన కుల్దీప్ యాదవ్ ఆఖరి బంతిని వేసి ఓవర్‌ను పూర్తి చేశాడు. ఫీల్డింగ్‌లో అలసత్వం కనబర్చడంతోనే కుల్దీప్ యాదవ్‌పై కోహ్లీ, రోహిత్ ఆగ్రహానికి గురయ్యారు. నెటిజన్లు సైతం కుల్దీప్ యాదవ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ట్రావిస్ హెడ్(39), కూపర్(0), మార్నస్ లబుషేన్(29), జోష్ ఇంగ్లీస్ త్వరగానే ఔటైనా.. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ దూకుడుగా ఆడుతున్నారు.

Story first published: Tuesday, March 4, 2025, 17:07 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+