Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: 6 ఓవర్లలో 3 తప్పిదాలు.. కేఎస్ భరత్‌పై పేలుతున్న జోకులు!

IND vs AUS: KS Bharat trolls after sloppy work with gloves in Ahmedabad Test

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ తడబడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేయడంతో పాటు బంతులను ఆపడంలోనూ తడబడ్డాడు. టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్‌కు దిగగా.. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ రిథమ్ అందుకోవడానికి టైమ్ తీసుకున్నాడు. దాంతో ఆసీస్ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకుంది. తొలి బంతికే భారీ వైడ్ వేసిన షమీ, తొలి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చేశాడు. ఉస్మాన్ ఖవాజా ఆడిన షాట్‌ను ఆపడంలో విఫలమైన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు.

లాలిపాప్ క్యాచ్..

ఈ ఒత్తిడిలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. బంతి అంచనా వేయడం విఫలమైన భరత్.. బంతిని ఒడిసిపట్టుకోలేకపోయాడు. ఆ సమయానికి ట్రావిస్ హెడ్ స్కోరు 7 పరుగులు కాగా ఆస్ట్రేలియా 23 పరుగులు మాత్రమే చేసింది. మొదటి 6 ఓవర్లలోనే శ్రీకర్ భరత్ మూడు తప్పిదాలు చేశాడు. దాంతో భరత్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌తో పోల్చుతూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

లగాన్ సినిమాలోని..

లగాన్ సినిమాలోని సన్నివేశాలతో పాటు ఫన్నీ కామెంట్స్‌తో జోకులు పేల్చుతున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైనా కీపింగ్ బాగా చేస్తాడని భరత్‌‌ను జట్టులో కొనసాగితే.. జట్టుకు తీవ్ర నష్టం చేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని భరత్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. గతిలేకనే రోహిత్ శర్మ.. కేఎస్ భరత్‌ను కొనసాగిస్తున్నాడని మండిపడుతున్నారు. కేఎస్ భరత్ చెత్త కీపింగ్ చూడలేకనే భారత ప్రధాని నరేంద్ర మోదీ మైదానం వీడాడని ట్రోల్ చేస్తున్నారు. రిషభ్ పంత్ లేని లోటు కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.

అశ్విన్ వికెట్ తీయడంతో..

క్రీజులో సెట్ అయిన ట్రావిస్ హెడ్‌(44 బంతుల్లో 7 ఫోర్లతో 32)ను ఎట్టకేలకు అశ్విన్ ఔట్ చేయడంతో భరత్ ఊపిరి పీల్చుకున్నాడు. అశ్విన్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీని ట్రావిస్ హెడ్ లాఫ్టెడ్ షాట్ ఆడాడు. అయితే సరైన ఎలివేషన్ దొరకకపోవడంతో మిడాన్‌లో ఉన్న రవీంద్ర జడేజా చేతుల్లోకి వెళ్లింది. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక క్రీజులోకి వచ్చిన లబుషేషన్‌ను మహమ్మద్ షమీ తన సెకండ్ స్పెల్‌లో పెవిలియన్ చేర్చాడు. స్టన్నింగ్ డెలివరీతో కట్ అండ్ బౌల్డ్‌ చేశాడు. క్రీజులోకి స్మిత్ రాగా.. ఆసీస్ 75/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

Story first published: Thursday, March 9, 2023, 12:43 [IST]
Other articles published on Mar 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+