Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కేఎస్ భరత్‌ను తీసిపారేయండి ద్రవిడ్ గారూ.. ఆ రాహుల్ ఎంతో నయం!

IND vs AUS: KS Bharat Brutally Trolled For His Poor Performance In Indore Test

ఇండోర్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ వైఫల్యం కొనసాగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ భరత్ దారుణంగా విఫలమయ్యాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవాల్సిన భరత్ 8 బంతుల్లో 3 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాథన్ లయన్ బౌలింగ్‌ను ఆడలేక మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ సిరీస్ తొలి టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భరత్.. 5 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోయాడు.

ఐదు ఇన్నింగ్స్‌ల్లో విఫలం..

నాగ్‌పూర్ టెస్ట్‌లో 8 పరుగులే చేసిన భరత్.. ఢిల్లీ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. కడవరకు నిలిచి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇండోర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసిన భరత్.. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ విఫలమయ్యాడు.

దాంతో అభిమానులు భరత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషభ్ పంత్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని కామెంట్ చేస్తున్నారు. కేఎస్ భరత్ జట్టులో ఉండటం వల్ల అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగం బలహీనంగా మారుతుందని, అతని వల్ల కీపింగ్ తప్పా మరే ఉపయోగం లేదని కామెంట్ చేస్తున్నారు.

ఆ రాహుల్ నయం..

కేఎస్ భరత్ కంటే వృద్దిమాన్ సాహా ఎంతో నయమని, అతను విలువైన పరుగులు చేసేవాడని గుర్తు చేస్తున్నారు. వెంటనే అతన్ని జట్టులో నుంచి తప్పించి యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఆడించాలని కోరుతున్నారు. చివరకు కేఎల్ రాహుల్‌ను ఆడించినా నయమేనని, అతని కీపింగ్‌తో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌గా రాణించగలడని కామెంట్ చేస్తున్నారు.

కేఎస్ భరత్‌కు ఇదే చివరి సిరీస్ అవుతుందని, అతని అంతర్జాతీయ కెరీర్ మూడు మ్యాచ్‌లతోనే ముగిసిపోనుందని జోస్యం చెబుతున్నారు. కొందరు తెలుగు ఫ్యాన్స్ భరత్‌కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నా.. ఇతర రాష్ట్రాల అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు సంజూ శాంసన్‌ను తీసుకున్నా జట్టుకు ఉపయోగం ఉండేదని, అతని రంజీ గణంకాలు భరత్ కంటే మెరుగ్గా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

భారత బౌలర్లు చెలరేగినా..

156/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్(3/44), ఉమేశ్ యాదవ్(3/12) ధాటికి 197 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్‌కు 89 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

బ్యాటర్లు విఫలం..

బ్యాటర్లు విఫలం..

రోహిత్ శర్మ(33 బంతుల్లో 12)తో పాటు శుభ్‌మన్ గిల్(5), విరాట్ కోహ్లీ(13), రవీంద్ర జడేజా(7), శ్రీకర్ భరత్(3), రవిచంద్రన్ అశ్విన్ దారుణంగా విఫలమయ్యారు. మధ్యలో శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. తేశ్వర్ పుజారా(52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. అక్షర్ పటేల్ (4 బ్యాటింగ్) అతనికి అండగా నిలిచాడు.

Story first published: Thursday, March 2, 2023, 16:24 [IST]
Other articles published on Mar 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+