Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన స్మిత్! (వీడియో)

 IND vs AUS: KL Rahul takes stunning catch to dismiss Steve Smith goes viral

ముంబై: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul) కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో స్టీవ్ స్మిత్‌(30 బంతుల్లో 4 ఫోర్లతో 22)ను పెవిలియన్ చేర్చాడు. వికెట్ల వెనుకాల ఫుల్ లెంగ్త్ డైవ్‌తో రాహుల్ అందుకున్న ఈ క్యాచ్ అభిమానులతో పాటు కామెంటేటర్లను ఆకట్టుకుంది. స్టీవ్ స్మిత్ (Steve Smith) అయితే రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌కు బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అయ్యాయి.

హార్దిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని హార్దిక్ పాండ్యా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. స్మిత్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. దాంతో స్మిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన బంతి వేయకపోయినా చెత్త షాట్‌తో ఔటయ్యాననే బాధతో స్మిత్ మైదానం వీడాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బామ్మర్ది పెళ్లి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వైస్ కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు. టాస్ గెలిచిన హార్దిక్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఆదిలోనే మహమ్మద్ సిరాజ్ ఆసీస్‌కు షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌(5)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. భారత బౌలర్లపై అతను ఎదురుదాడికి దిగడంతో ఆసీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది.

స్మిత్ ఔటైనా.. లబుషేన్‌తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను పరుగెత్తించాడు. ఈ క్రమంలో 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్.. మరింత ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ అతని జోరుకు రవీంద్ర జడేజా బ్రేక్ వేసాడు. ఊరించే బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆసీస్ 129 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోయింది.

Story first published: Friday, March 17, 2023, 15:28 [IST]
Other articles published on Mar 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+