Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా సక్సెస్ మంత్రా అదే.. ఆ ఇద్దరి బ్యాటింగ్ అద్భుతం: కేఎల్ రాహుల్

టీమిండియా టెయిలెండర్స్ ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కొనియాడాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లోజస్‌ప్రీత్ బుమ్రా (27 బంతుల్లో సిక్స్‌తో 10 బ్యాటింగ్), ఆకాశ్ దీప్(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 బ్యాటింగ్)అసాధారణ బ్యాటింగ్‌తో ఫాలోయింగ్ గండం నుంచి గట్టెక్కించారు.

ఆఖరి వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించారు. దాంతో ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం టీమిండియాకు దక్కింది. వెలుతురు లేమితో అంపైర్లు నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది. బుధవారం చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

IND vs AUS KL Rahul reveals his success mantra with bat in overseas Tests after Gabba heroics

అంతకుముందు కేఎల్ రాహుల్(139 బంతుల్లో 8 ఫోర్లతో 84), రవీంద్ర జడేజా(123 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 77) హాఫ్ సెంచరీలతో రాణించారు. నాలుగో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'మా 9వ వికెట్ పడగానే ఫాలో ఆన్ ఆడాల్సి వస్తుందని నేను మళ్లీ ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు సిద్దమయ్యాను. కానీ ఆకాశ్ దీప్ బుమ్రా అద్భుతంగా పోరాడారు. ఈ ఇద్దరూ చరిత్రలో నిలిచిపోయే భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరి బ్యాటింగ్ ఈ మ్యాచ్‌ ఫలితాన్ని శాసించింది. అసాధారణ బ్యాటింగ్‌తో ఫాలో ఆన్ తప్పించడం అద్భుతం. ఆఖరి వికెట్‌కు వారు కనబర్చిన పోరాటం చూడముచ్చటగా అనిపించింది.

నా సక్సెస్ మంత్రా బేసిక్స్‌కు కట్టుబడి ఆడటమే. శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులను ఆడుతూ.. ఔట్ సైడ్ బాల్స్‌ను వదిలేసాను. కొత్తగా ఏం చేయలేదు. పరిస్థితులకు తగ్గట్లు బేసిక్స్‌కు కట్టుబడి ఆడాను. ఇలాంటి పిచ్ కండిషన్స్‌పై బంతులను వదిలేయడం చాలా ముఖ్యం. నేనే కాదు ప్రతీ ఒక్కరు గుడ్ లెంగ్త్, ఔట్ సైడ్ బంతులు వదిలేయడం కీలకం. ఓవర్‌సీస్ కండిషన్స్‌లో రాణించాలంటే ప్రతీ ఒక్కరు ఈ ఫార్మూలాను అనుసరించాలి.

ఆస్ట్రేలియాలో ఆడినా.. క్వాలిటీ పేసర్లను ఎదుర్కొన్నా.. బంతులను వదిలేయాలి. ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై ఆడటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తొలి 20-30 ఓవర్లు బౌలర్లను గౌరవించాలి. గుడ్ లెంగ్త్ బాల్స్‌ను వదిలేయాలి. వీలైనంత వరకు పకడ్బందీగా బ్యాటింగ్ చేయాలి. బంతి పాతబడేవరకు ఓపికగా బ్యాటింగ్ చేయాలి. ఆ తర్వాత పాత బంతిని క్యాస్ చేసుకోవాలి. టెస్ట్ క్రికెట్‌లో నా ఫార్మూలా ఇదే.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. తాజా టెస్ట్‌లో కేఎల్ రాహుల్‌తో సహా భారత్ టాప్-6 బ్యాటర్లు గుడ్ లెంగ్త్ బాల్స్‌ను వదిలేయలేక వికెట్ పారేసుకున్నారు.

Story first published: Tuesday, December 17, 2024, 17:04 [IST]
Other articles published on Dec 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+