Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాజీ ఆటగాళ్ల మధ్య మాటల యుద్దానికి తెరలేపిన కేఎల్ రాహుల్ పేలవ ఫామ్.. మళ్లీ ఒకరినొకరు చూసుకోకుండా..!

IND vs AUS: KL Rahul debate turns into ugly spat between Aakash Chopra and Venkatesh Prasad

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ మాజీ ఆటగాళ్ల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. సోషల్ మీడియా వేదికగా మళ్లీ ఒకరినొకరు చూసుకోకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. రాహుల్ పేలవ ఫామ్‌ను ప్రస్తావిస్తూ టీమ్ సెలెక్షన్ తీరును మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా తప్పుబట్టాడు. 8 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా దారుణమైన గణంకాలు నమోదు చేయడం ఏంటని వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ఈ ట్వీట్లకు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా కౌంటరిచ్చాడు. వెంకటేశ్ ప్రసాద్ ఇలా చేయడం వెనుక వ్యక్తిగత అజెండా ఉందని ఆరోపించాడు.

ట్విటర్ వేదికగా కౌంటర్లు..

కేఎల్ రాహుల్‌కు సేన (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మంచి రికార్డ్ ఉందంటూ వాటికి సంబంధించిన గణాంకాలను ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. బహుశా అందుకే సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డాడు. ఇక తాను బీసీసీఐ నుంచి ఎలాంటి పదవిని కూడా ఆశించడం లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత అజెండా అంటూ చేసిన ఆరోపణలపై వెంకటేశ్ ప్రసాద్ ఘాటుగా స్పందించాడు. 2012లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌ను ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను బయటపెట్టిన వెంకటేశ్ ప్రసాద్.. భిన్నాభిప్రాయం ఉన్నంత మాత్రాన దాన్ని వ్యక్తిగత అజెండా అనలేమ గట్టిగా కౌంటరిచ్చాడు. ఆకాశ్ చోప్రా తనతో ఏకీభవించకపోవచ్చని, కానీ అతడి వివరణ పూర్తి భిన్నంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఎవరికీ వ్యతిరేకం కాదు..

ఇక మ్యాచ్ కొనసాగుతుండగానే కేఎల్ రాహుల్ ఆటతీరు, జట్టులో చోటు విషయమై వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్లు చేయడాన్ని చోప్రా తప్పుబట్టగా.. దానికి వెంకటేశ్ వివరణ ఇచ్చుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ట్వీట్లు చేసినప్పటికీ ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదని.. ఆటగాళ్లు మైదానంలోకి వచ్చే ముందే తమ ఫోన్లను డిపాజిట్ చేస్తారని గుర్తు చేశాడు. తాను ఏ ఆటగాడికి వ్యతిరేకం కాదని, ఎలాంటి ఎజెండాతో మాట్లాడటం లేదని స్పష్టం చేశాడు. తన మాటలు ఇతరులకు నచ్చకపోవచ్చని, అంత మాత్రానా వ్యక్తిగత అజెండా అనడం ఏ మాత్రం సమంజసం కాదని మండిపడ్డాడు.

రోహిత్ శర్మను ఎలా ఎంపిక చేస్తారని..

2012లో అజింక్యా రహానేను కాదని టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ తీసుకోవడంపై ఆకాశ్ చోప్రా సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు 'రహానేకు తుది జట్టులో చోటు దక్కలేదు. 'ప్రతిభావంతుడైన' రోహిత్‌కు దక్కింది'అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ట్వీట్‌ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన వెంకటేశ్ ప్రసాద్.. 'అంతర్జాతీయ క్రికెట్లో నాలుగేళ్ల అనుభవం ఉన్న 24 ఏళ్ల క్రికెటర్‌ గురించి నువ్వు వ్యంగ్యంగా మాట్లాడొచ్చు కానీ.. 8 ఏళ్లుగా సరైన ఆటతీరు కనబర్చని ఆటగాడి గణాంకాలను మాత్రం నేను బయటపెట్ట వద్దా?'అని ఆకాశ్ చోప్రా తీరును విమర్శించాడు. వ్యక్తిగతంగా చోప్రాతో తనకు ఎలాంటి గొడవలు లేవన్న వెంకటేశ్ ప్రసాద్.. అతని యూట్యూబ్ విశ్లేషణలను తాను ఇష్టపడతానని చెప్పాడు.

లైవ్ డిబేట్‌కు ఆహ్వానం..

వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న ఆకాశ్ చోప్రా.. అతన్ని లైవ్ డిబేట్‌కు ఆహ్వానించాడు. 'వెంకీ బ్రో.. నీ మెసేజ్‌ల్లో అర్థం మారిపోతోంది. నువ్వు ట్విటర్‌లో ఉన్నావ్.. నేను యూట్యూబ్‌లో ఉన్నాను. నాతో వీడియో చాట్, లైవ్ డిబెట్‌కు రావాలని ఆహ్వానిస్తున్నా. మరింత లోతుగా చర్చిద్దాం. ఈ విషయంలో నాకు ఎలాంటి స్పాన్సర్లు లేవు. అయినా నీ దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది కదా'అని ట్వీట్ చేశాడు. అయితే ఈ ఆహ్వానాన్ని వెంకటేశ్ ప్రసాద్ తిరస్కరించాడు. సొంత అజెండాతో మాట్లాడుతున్నాడని చెప్పడమే నన్ను బాధించిందన్నాడు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని, ఈ విషయంపై ఇక చర్చ జరపాలని తాను అనుకోవడం లేదని బదులిచ్చాడు.

Story first published: Wednesday, February 22, 2023, 10:23 [IST]
Other articles published on Feb 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+