IND vs AUS: మళ్లీ విఫలమైన కేఎల్ రాహుల్.. వేటు పడటం ఖాయం! బిగ్ ఫ్రాడ్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!

న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులే చేసి విఫలమైన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసాడు. కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినా.. రాహల్ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. అతన్ని బ్యాడ్ లక్ కూడా వెంటాడింది.
నాథన్ లయన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే రాహుల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రాహుల్ ఆడిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ తాకి గాల్లోకి లేవగా.. కీపర్ క్యారీ అందుకున్నాడు. దాంతో రాహుల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వైఫల్యంతో అతనిపై వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్‌కు ఇన్ని అవకాశాలు ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.
వేటు వేయాల్సిందే..
మరోసారి రాహుల్ విఫలమవ్వడంపై అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే రాహుల్‌ను జట్టు నుంచి తొలగించి రంజీ ట్రోఫీ ఆడించాలని సూచిస్తున్నారు. కొందరు అయితే రాహుల్‌ను మూడు ఫార్మాట్ల నుంచి తప్పించాలని సూచిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రాహుల్‌కు ఇక ఇరానీ కప్ గతని సెటైర్లు పేల్చుతున్నారు.
గత 47 ఇన్నింగ్స్‌లో రాహుల్.. 26.15 సగటుతో 1203 పరుగుల మాత్రమే చేశాడని, ఇందులో మూడేసి సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఉంటే.. ఐదు సార్లు డకౌటయ్యాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. శిఖర్ ధావన్, మురళీ విజయ్‌కు కూడా ఈ మద్దతు లభించలేదని కామెంట్ చేస్తున్నారు.
ఉద్యోగం అయితే ఎప్పుడో ఊడేది..
ఎదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇదే ప్రదర్శనను రాహుల్ కనబరిస్తే ఎప్పుడో పీకీపారేసే వారని, బీసీసీఐ మాత్రమే అతన్ని అంటిపెట్టుకుంటుందని మండిపడుతున్నారు. గత 10 ఇన్నింగ్స్‌లో విరాట్ 125 పరుగులే చేశాడని, యావరేజ్ మరి దారుణంగా ఉందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ టెస్ట్ కెరీర్‌లో 17 సింగిల్ డిజిట్ స్కోర్లున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐని ఫ్యాన్స్ కోరుతున్నారు.
వేటు పడటం ఖాయం..
ఈ రెండు టెస్ట్‌ల ప్రదర్శన ఆధారంగా ఎస్‌ఎస్ దాస్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆదివారం చివరి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించనుంది. అయితే అప్‌కమింగ్ రెండు టెస్ట్‌లకు రాహుల్‌పై వేటు పడేసే అవకాశాలున్నాయి. అతన్ని భారత జట్టు నుంచి తప్పించి ఇరానీ కప్ ఆడించనున్నారు. రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టు ఓపెనర్‌గా కొనసాగనుండగా.. బ్యాకప్ ఓపెనర్‌గా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ప్లేయర్‌కు అవకాశం దక్కనుంది.
విజయం దిశగా భారత్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా.. టీమిండియా 262 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా గట్టెక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 113 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌కు అశ్విన్ (3/59) మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్‌లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ 1 పరుగు ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications