దమ్ముంటే కొట్టురా కొన్‌స్టాస్.. బుమ్రా తగ్గేదేలే! (వీడియో)
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దుమ్మురేపాడు. 19 ఏళ్ల కుర్రాడికి తన సత్తా ఏంటో తెలియజేశాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌ను చితక్కొట్టిన ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు తన పేస్ రుచి చూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించిన సామ్ కొన్‌స్టాస్.. బుమ్రా బౌలింగ్‌లో ర్యాంప్ షాట్స్‌తో విరుచుకుపడ్డాడు.

బిత్తరపోయిన సామ్ కొన్‌స్టాస్..
అతని ధాటికి బుమ్రా మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్స్ సమర్పించుకున్నాడు. తొలి 6 ఓవర్లలోనే 38 పరుగులు ఇచ్చుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌ను అలవోకగా ఆడనని కొన్‌స్టాస్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. భారత బ్యాటింగ్ సందర్భంగా మెల్‌బోర్న్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ.. తానో స్టార్ క్రికెటర్‌లా ఫీలవుతూ ఫోజులు కొట్టాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాXకొన్‌స్టాస్ పోరు ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ భారత పేసర్ ముందు ఈ 19 ఏళ్ల కుర్రాడు నిలవలేకపోయాడు. కొనస్టాస్ బ్యాటింగ్‌ను డీకోడ్ చేసిన బుమ్రా.. అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లోనే స్టన్నింగ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన బంతి కొన్‌స్టాస్ ప్యాడ్, బ్యాట్ గ్యాప్ నుంచి వెళ్లి వికెట్లను పడేసింది. ఈ బంతికి సామ్ కొన్‌స్టాస్ బిత్తరపోయాడు.
దమ్ముంటే కొట్టురా కొన్‌స్టాస్..
దాంతో భారత ఆటగాళ్లు, బుమ్రా సంబరాలు చేసుకున్నారు. బుమ్రా అయితే ఇప్పుడు అరవండి అంటూ అభిమానులకు సైగలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. 'దమ్ముంటే కొట్టురా కొన్‌స్టాస్'అని తన బంతితో ప్రశ్నలు సంధించాడు. బుమ్రా బౌలింగ్‌లో కొనస్టాస్ అనేకసార్లు బీట్ అయ్యాడు.
358/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి మరో 9 పరుగులు మాత్రమే జోడించి నాథన్ లయన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఆసీస్‌కు 105 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్, బుమ్రా, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో ఆసీస్ 43 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. క్రీజులో లబుషేన్(28 బ్యాటింగ్)తో పాటు స్టీవ్ స్మిత్(4 బ్యాటింగ్) ఉన్నారు.
BUMRAH GETS KONSTAS.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2024
- The celebration by Bumrah was absolute cinema. 🔥pic.twitter.com/T04Ilq6dqF
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications